iDreamPost

ఈ యోగా బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? ఇండస్ట్రీలో ఇప్పుడో స్టార్ యాంకర్..

ఈ యోగా బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు ఈమె ఒక స్టార్ యాంకర్. తెలుగులో యాంకర్ గా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న బ్యూటీ. అందంతోనే కాకుండా తన ఆకర్షణీయమైన మాటలతో ఆకట్టుకోవడంలో దిట్ట.

ఈ యోగా బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు ఈమె ఒక స్టార్ యాంకర్. తెలుగులో యాంకర్ గా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న బ్యూటీ. అందంతోనే కాకుండా తన ఆకర్షణీయమైన మాటలతో ఆకట్టుకోవడంలో దిట్ట.

ఈ యోగా బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? ఇండస్ట్రీలో ఇప్పుడో స్టార్ యాంకర్..

యోగా చేస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ఆమె ఇప్పుడు బుల్లితెర స్టార్ యాంకర్. యాంకర్ గా రాణించాలన్నా, యాంకర్ గా కొనసాగాలన్నా ఎక్స్ పోజింగ్ చేయాలి అన్న రూల్స్ కి ఈమె విరుద్ధం. స్కిన్ షో అంటే ఏంటో తెలియని యాంకర్ ఈమె. తెలిసినా గానీ దాని జోలికి పోనటువంటి అమ్మాయి. అయినప్పటికీ స్టార్ యాంకర్ గా ఇండస్ట్రీలో చెలామణి అవుతున్నారు. అలా అని యాంకరింగ్ లో ఎక్కడా కూడా తేడా మాటలు ఉండవు. డబుల్ మీనింగ్ డైలాగులు, కుళ్ళు జోకులు, అశ్లీల సంభాషణలు వంటి వాటికి తన డిక్షనరీలో చోటు లేదు. ఆమె డిక్షన్ కి ఫ్యాన్స్ అడిక్షన్ కి గురవుతారు. అంతలా ఆమె గలగల మాట్లాడుతూ యాంకరింగ్ చేస్తారు. హీరో, హీరోయిన్లతో సమానంగా ఇప్పుడు యాంకర్స్ కూడా ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటున్నారు. అలాంటి యాంకర్స్ లో ఈమె కూడా ఉన్నారు.

ఈమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. యాంకర్ సుమ, ఝాన్సీ ఒకప్పుడు ఎంత హుందాగా ప్రోగ్రామ్స్ ని రక్తికట్టించేవారో అలా ఈమె కూడా ఎంతో హుందాగా షోస్, ఈవెంట్స్ కి హోస్ట్ గా ఉంటూ వస్తున్నారు. కేవలం మాటలతో మాత్రమే యాంకరింగ్ చేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా హద్దులు మీరు ప్రవర్తించరు. కొంతమంది స్టార్ స్టేటస్ కోసం స్కిన్ షో చేస్తూ ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ ఖాతాల్లో ఫోటోలు షేర్ చేస్తారు. కానీ ఈమె మాత్రం పధ్ధతిగా ఉన్న ఫోటోలను మాత్రమే షేర్ చేస్తారు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ఎక్కడా, ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించలేదు. ఏ ప్రోగ్రాం అయినా, ఏ షో అయినా, ఏ ఈవెంట్ అయినా గానీ పద్ధతిగా, చక్కని కట్టుబొట్టుతో హుందాగా దాన్ని సక్సెస్ చేయడంలో ఈమె దిట్ట.

Anchor geetha bhagat yoga

ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కిన్ షోతోనే కాకుండా స్కిల్స్ తో కూడా సక్సెస్ అవ్వచ్చు, ఫ్యాన్స్ ని సంపాదించుకోవచ్చు అని ఈమె నిరూపించారు. సుమ, ఝాన్సీ వంటి యాంకర్స్ లా మాటలతోనే ఆకట్టుకునే విధంగా యాంకరింగ్ చేయవచ్చునని ఈమె మరోసారి రుజువు చేశారు. బోర్ ఫీలవ్వకుండా మాట్లాడడం, సున్నితమైన పంచులు వేస్తూ నవ్వించడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య. సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో, ప్రాసలతో అవతల వారిని కాసేపు ఆట పట్టించి వినోదాన్ని అందిస్తారు. ఇంటర్వ్యూల్లో, ఈవెంట్స్ లో సెలబ్రిటీల నుంచి తనదైన శైలిలో ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు రాబడుతుంటారు. వివాదాలకు దూరంగా ఉంటూ తన జీవితం ఏదో తాను జీవిస్తూ.. తను ఎంచుకున్న రంగంలో దూసుకుపోతున్నారు. ఈమె పేరు గీతా భగత్. గీతా భగత్ అంటే తెలియని వారు ఉండరు. ఆమె మాటలకు, ఆమె యాంకరింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. యాంకర్ గానే కాకుండా సినిమాల్లో కూడా నటించారు. వసూల్ రాజా, జననం, కలయా నిజమా సినిమాల్లో నటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి