iDreamPost

కూతురుకి పెళ్లి చేయాల్సిన తల్లి ప్రేమలో పడితే? ‘పరిణయం’మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Parinayam Movie: ఈ మధ్య ఓటీటీలో భాషతో సంబంధం లేకుండా రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్ సీరీస్ కి మంచి ఆధరణ లభిస్తుంది. కంటెంట్ బాగుంటు ఎలాంటి మూవీస్ అయినా కనెక్ట్ అవుతుంటారు.

Parinayam Movie: ఈ మధ్య ఓటీటీలో భాషతో సంబంధం లేకుండా రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్ సీరీస్ కి మంచి ఆధరణ లభిస్తుంది. కంటెంట్ బాగుంటు ఎలాంటి మూవీస్ అయినా కనెక్ట్ అవుతుంటారు.

కూతురుకి పెళ్లి చేయాల్సిన తల్లి ప్రేమలో పడితే? ‘పరిణయం’మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్ బాగుంటే ఎలాంటి సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. భారీ బడ్జెట్.. స్టార్ హీరోల సినిమాలు కంటెంట్ సరిగా లేక అట్టర్ ఫ్లాప్ అవుతున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాలు అయినా.. ఫీల్ గుడ్ మూవీస్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ దున్నేస్తుంది. థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఫ్యామిలీ, క్రైమ్ థ్రిల్లర్, హర్రర్ జోనర్ లో వస్తున్న మూవీస్ కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు,వెబ్ సీరీస్ ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కూతురికి పెళ్లి చేయాల్సిన వయసులో తల్లి ప్రేమలో పడితే ఆ తల్లీ కూతుళ్లు ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్ తో వచ్చిన మాలీవుడ్ మూవీ తెలుగు లో ‘పరిణయం’ డబ్ చేశారు. ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎక్కడ అన్న విషయం గురించి తెలుసుకుందా. వివరాల్లోకి వెళితే.

మాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వరకు రియాల్టీకి దగ్గరగా ఉన్న సినిమాలు తీస్తుంటారు. ఇటీవల మలయాళం సినిమాలు తెలుగులో రిలీజ్ అయి మంచి ఆధరణ పొందుతున్న విషయం తెలిసిందే. ప్రేమమ్, మంజుమ్మెల్ బాయ్స్ ఇలా చిన్న సినిమాలే అయినా మంచి విజయం సాధించి భారీ కలెక్షన్లు రాబట్టాయి.  మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘వరునే అవశ్యముంద్’ మూవీ 2020 లో రిలీజ్ చేశారు. ఈ మూవీ 2021 లో తెలుగు లో‘పరిణయం’ పేరుతో రిలీజ్ చేశారు. అనూప్ సత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వేఫారెర్ ఫిలమ్స్, ఎంస్టార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్, సురేష్ గోపీ, శోభన ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతు మంచి టాక్ తెచ్చుకుంది. ఇక మూవీ కథ విషయానికి వస్తే.. నీనా (శోభన) ఒక ట్యూటర్ గా పనిచేస్తుంది. ఆమె కూతురు నికిత (కళ్యాణి ప్రియదర్శన్). తల్లీ కూతురు మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు. నీనా ప్రేమ పెళ్లి చేసుకొని కొన్ని కారణాల వల్ల విడిపోతుంది. తనలా కాకుండా కూతురుని ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంచుతుంది. తన కూతురుకి అరెంజ్డ్ మ్యారేజ్ చేయాలని నిశ్చయించుకుంటుంది.

ఈ క్రమంలోనే నికిత అభి అనే కుర్రాడి ప్రేమలో పడుతుంది. వీరు ఉండే అపార్ట్ మెంట్ లో రిటైర్ట్ మేజర్ ఉన్న కృష్ణన్ (సురేష్ గోపి) నీనాని కలుస్తాడు. వీరి పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారుతుంది. ఈ విషయం చుట్టుపక్కల వాళ్ల ద్వారా నికితకు తెలుస్తుంది. ప్రేమ వ్యవహారం గురించి తన తల్లిని ప్రశ్నిస్తుంది.. కానీ ఆమె ఏ సమాధానం చెప్పదు. ఇదే విషయాన్ని తన బాయ్ ఫ్రెండ్ తో చెబితే అతను నికితను పక్కన పెడతాడు. అదే అపార్ట్ మెంట్ లో బిబీష్ (దుల్కన్ సల్మాన్) దిగుతాడు. అప్పటికీ బిబీష్ కి ఒక అమ్మాయితో బ్రేకప్ అవుతుంది. బిబీష్ కి నికితతో పరిచయం ఏర్పడుతుంది. వీరి పరిచయం ఎలా మారుతుంది.. నికిత తల్లి ప్రేమ ఏమవుతుంది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. సున్నితమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా చాలా చక్కగా తెరకెక్కించారు. మరి ఓటీటీలో ఈ మూవీ చూసి ఎలా ఉందో కామెంట్స్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి