iDreamPost

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక నుంచి రేషన్ షాపుల్లో..

  • Published May 23, 2024 | 11:00 AMUpdated May 23, 2024 | 11:00 AM

Ration Card: తెలంగాణలో సీఎం గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ లో తెల్ల రేషన్ కార్డుదారులకు మరో శుభవార్త చెప్పారు.

Ration Card: తెలంగాణలో సీఎం గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ లో తెల్ల రేషన్ కార్డుదారులకు మరో శుభవార్త చెప్పారు.

  • Published May 23, 2024 | 11:00 AMUpdated May 23, 2024 | 11:00 AM
రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక నుంచి రేషన్ షాపుల్లో..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస ప్రభుత్వం పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచార సమయంలో ఆరు గ్యారెంటీల హామీలో రెండు పథకాలు మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రారంభించారు. ఈ మధ్యనే రూ.500 సిలిండర్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాలు కూడా ప్రారంభించారు. విద్య, వైద్య, మహిళ, రైతు సంక్షేమాల పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. రానున్న రోజుల్లో పూర్తి పథకాలు అమలు చేస్తామని చెప్పారు. తాజాగా రేవంత్ సర్కార్ తెలంగాణ రేషన్ కార్డుదారులకు గొప్ప శుభవార్త చెప్పారు. వివరాల్లోకి వెళితే..

సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజలకు గొప్ప శుభవార్తల అందించారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ఇకపై సన్న బియ్యం అందించేందుకు ముందుకు వచ్చింది సర్కార్. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సన్న వడ్డకు బోనస్ ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం పై ఆయన స్పందించారు. తెలంగాణ పేదలు సన్నబియ్యం తినాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. అందుకు అవసరమైన వడ్లను మనమే ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో క్వింటాలుకు 500 రూపాయల బోనస్ పథకాన్ని ప్రవేశ పెట్టామని తెలిపారు. ఎన్నికల సమయంలో ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తుమ్మల గుర్తు చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమై బోనస్ పై చర్చించినట్లు ఆయన తెలిపారు.

ఇదిలా ఇలా ఉంటే రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా పెద్ద ఎత్తున పెరుగుతుందని..రేషన్ లో దొడ్డు బియ్యం తీసుకుంటున్న వారి సంఖ్య 40 శాతం కూడా వాటిని తినడం లేదని, నిల్వలు పెరిగిపోతున్నాయని అన్నారు. వీన్నంటిని దృష్టిలో పెట్టుకొని పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు సిద్దమైతున్నట్లు ఆయన తెలిపారు.  అలాగే త్వరలో కొత్త రేషన్ కార్డులు జారే చేయడానికి సిద్దమైతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల రూపం కూడా మార్చుతున్నట్లు తెలుస్తుంది. వీటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తుమ్మల పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ పూర్తయ్యాక కార్డులు ఎలా ఉండాలన్న విషయంపై చర్చించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు చిన్న పుస్తకంలో ఉండేవి.. ఆ తర్వాత సైజ్ పెద్దగా మారింది. త్వరలో వాటి స్థానంలో ఆహార భద్రత కార్డులను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రేషన్ షాపుల్లో సన్న బియ్యం వస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి