iDreamPost

ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు చేసిన హైకోర్టు! ఎందుకంటే?

  • Published May 23, 2024 | 8:41 AMUpdated May 23, 2024 | 8:41 AM

ఇప్పటికే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను కోల్‌కతా హైకోర్టు రద్దీ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా పశ్చిమబెంగాల్ టీఎంసీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది.

ఇప్పటికే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను కోల్‌కతా హైకోర్టు రద్దీ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా పశ్చిమబెంగాల్ టీఎంసీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది.

  • Published May 23, 2024 | 8:41 AMUpdated May 23, 2024 | 8:41 AM
ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు చేసిన హైకోర్టు! ఎందుకంటే?

దేశంలో సార్వత్రిక ఎన్నికల జరుగుతున్న వేళ మమతా బెనర్జీ నేతృత్వంలోని.. పశ్చిమబెంగాల్ టీఎంసీ ప్రభుత్వానికి ఊహించని షాక్‌ తగిలింది. కాగా, ఇప్పటికే అ‍క్కడ ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసిన కోల్‌కతా హైకోర్టు.. తాజాగా బుధవారం మరో సంచలన తీర్పును ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఓబీసీ సర్టిఫికేట్‌.. దీని వలన ఎంత ఉపయోగం ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటే ఈ సర్టిఫికెట్ కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. అయితే ఈ సర్టిఫికెట్ల పై పశ్చిమ బెంగాల్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా, OBC సర్టిఫికెట్లను రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.  ఈ క్రమంలోనే.. రాష్ట్రంలో 2010 నుంచి జారీ చేసిన సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈసారి ఏకంగా 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ సంచలన తీర్పును ఇచ్చింది. కాగా, 1993లో చేసిన చట్టానికి విరుద్ధంగా పత్రాలు జారీ చేశారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే ఇప్పటికే  ఉద్యోగాలు పొందిన వారు, రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన వారిపై ఎటువంటి ప్రభావం చూపదని జస్టిస్ తపబ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మంథాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. దీంతో వారికి కాస్త భారీ ఊరట లభించింది.

అయితే పశ్చిమ బెంగాల్‌లో 2011 లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలోనే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు కాకుండా మిగిలిన వెనుకబడిన తరగతులకు సంబంధించి 2012 నాటి పశ్చిమ బెంగాల్‌ చట్టం కింద కొన్ని వర్గీకరణలు చేసింది. అయితే మమతా బెనర్జీ తీసుకువచ్చిన ఆ నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ సవాలు చేస్తూ పలువురు కలకత్తా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరి, పశ్చిమబెంగాల్‌ లో 5 లక్షల OBC సర్టిఫికెట్లను రద్దు చేయడం పై మీ అభిప్రాయాలను కామెకంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి