iDreamPost

RCB vs RR: ధోని RCBకి మద్ధతు ఇచ్చినా.. సీఎస్కే ఫ్యాన్స్ ఓవరాక్షన్! RRకు సపోర్ట్ చేస్తూ..

ఆర్సీబీ వర్సెస్ రాజస్తాన్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఆర్సీబీ ఓడిపోవడంతో ఆ టీమ్ పై విమర్శలు, ట్రోల్స్ గుప్పించారు. అదీకాక ఏకంగా గ్రౌండ్ లోనే ఆర్ఆర్ టీమ్ కు సపోర్ట్ చేస్తూ కనిపించారు.

ఆర్సీబీ వర్సెస్ రాజస్తాన్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఆర్సీబీ ఓడిపోవడంతో ఆ టీమ్ పై విమర్శలు, ట్రోల్స్ గుప్పించారు. అదీకాక ఏకంగా గ్రౌండ్ లోనే ఆర్ఆర్ టీమ్ కు సపోర్ట్ చేస్తూ కనిపించారు.

RCB vs RR: ధోని RCBకి మద్ధతు ఇచ్చినా.. సీఎస్కే ఫ్యాన్స్ ఓవరాక్షన్! RRకు సపోర్ట్ చేస్తూ..

ఫ్యాన్ వార్.. మనం తరచుగా సోషల్ మీడియాలో వినే పదం. ఎక్కువగా సినిమా హీరోల ఫ్యాన్స్ మధ్య ఈ వార్స్ జరుగుతూ ఉంటాయి. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ.. ఇరు వర్గాల అభిమానులు కొట్టుకోవడం మనం చాలానే చూశాం.  ఇక ఈ ఫ్యాన్ వార్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో కూడా ఉంది. తాజాగా ఆర్సీబీ వర్సెస్ రాజస్తాన్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఆర్సీబీ ఓడిపోవడంతో ఆ టీమ్ పై విమర్శలు, ట్రోల్స్ గుప్పించారు. అదీకాక ఏకంగా గ్రౌండ్ లోనే ఆర్ఆర్ టీమ్ కు సపోర్ట్ చేస్తూ కనిపించారు. అసలేం జరిగిందంటే?

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న(బుధవారం) రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో ఆర్ఆర్ టీమ్ ఆర్సీబీ చిత్తు చేసి టోర్నీలో ముందుకు దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ రేర్ సీన్ క్రికెట్ ప్రేమికులకు ఆశ్చర్యానికి గురిచేసింది. అదేంటంటే? ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ రాజస్తాన్ రాయల్స్ టీమ్ కు సపోర్ట్ చేశారు. ఇన్నింగ్స్ 14.2 ఓవర్లో ఆర్సీబీ ఆటగాడు రజత్ పాటిదార్ అవుట్ అయ్యాడు. అప్పుడు సీఎస్కే ఫ్యాన్స్ సంతోషంలో అరుపులు, నవ్వులు చిందిస్తూ ఓవరాక్షన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అదీకాక.. ఆర్సీబీ ఓడిపోయిన తర్వాత గ్రౌండ్ బయట ఉన్న ఆర్సీబీ పోస్టర్లను చించేశారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. చెన్నై ని డూ ఆర్ డై మ్యాచ్ లో ఆర్సీబీ ఓడించింది అన్న కారణంతో ఫ్యాన్స్ ఈ విధంగా చేశారు. అయితే.. మహేంద్రసింగ్ ధోని మాత్రం ఆర్సీబీ కప్ గెలవాలని డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ కోహ్లీతో అన్న విషయం తెలిసిందే. ధోని ఆర్సీబీకి మద్ధతు ప్రకటించినప్పటికీ.. సీఎస్కే ఫ్యాన్స్ ఇలా ఆర్ఆర్ టీమ్ కు సపోర్ట్ చేయడం ఏంటని? మరికొందరు విమర్శిస్తున్నారు. అటు అంబటి రాయుడు సైతం ఆర్సీబీపై విమర్శల వర్షం కురిపించిన విషయం మనందరికి తెలియనిది కాదు. మరి ఆర్సీబీకి ధోని మద్ధతు ఇచ్చినా.. ఫ్యాన్స్ మాత్రం రాజస్తాన్ కు సపోర్ట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sarcasm (@sarcastic_us)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి