iDreamPost

విజయ్ చేతిలో ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఆ సీరియల్ నటి అని తెలుసా..? నమ్మలేరు

ఇక్కడ ఈ ఫోటోలో విజయ్ చేతిలో కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు ఆ సీరియల్ నటి అని తెలుసా.. చిన్న నాటి నుండి అలరిస్తున్న ఈ పాప.. ఇప్పుడు ఎలా ఉందంటే..? ఏం చేస్తుందంటే..?

ఇక్కడ ఈ ఫోటోలో విజయ్ చేతిలో కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు ఆ సీరియల్ నటి అని తెలుసా.. చిన్న నాటి నుండి అలరిస్తున్న ఈ పాప.. ఇప్పుడు ఎలా ఉందంటే..? ఏం చేస్తుందంటే..?

విజయ్ చేతిలో ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఆ సీరియల్ నటి అని తెలుసా..? నమ్మలేరు

తమిళ ఇండస్ట్రీల్లో టాప్ హీరోల్లో ఒకరు ఇళయ దళపతి విజయ్. రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంతటి మేనియాను కలిగిన నటుడు విజయ్. తెలుగులో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా అతడి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం నటుడు మాత్రమే కాదు.. ఎన్టీవో సంస్థను స్థాపించి సేవలు కూడా అందిస్తుంటాడు. గత ఏడాది లియోతో అలరించిన విజయ్.. ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీతో రాబోతున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఇక విజయ్ కొన్ని సినిమాల వరకే తెరపై కనిపించనున్నాడని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. దానికి కారణం.. అతడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడమే కారణం. ఎప్పటి నుండో పాలిటిక్స్‌లోకి వస్తున్నాడని వార్తలు రాగా, వాటిని నిజం చేశాడు దళపతి. ఇటీవల తమిళ వెట్రి కళగం అనే పార్టీ పేరును ప్రకటించిన సంగతి విదితమే.

ఇదిలా ఉంటే.. విజయ్ చేతిలో ఉన్న ఈ పాప ఎవరో తెలుసా..? ఆమె పలు సీరియల్లో నటించింది. చిన్నప్పుడు ఓ సినిమాలో అలా మెరిసింది. అదే ఏం మూవీ అంటే రజనీకాంత్, రమ్యకృష్ణ నట విశ్వరూపం నరసింహ. ఇందులో సౌందర్య మరో హీరోయిన్. నీలాంబరి లాంటి క్యారెక్టర్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. ఇక ఇందులో నా పేరు నరసింహ పాటలో ‘నేను మీసమున్న బాలుడయ్యా’అన్నప్పుడు ఈ అమ్మాయి పిక్ వస్తుంది. అలా వచ్చి అలా వెళ్లిపోతుంది.. ఆమె ఎవరు అంటే హిమ బిందు. ఆ చిన్నారి ఇప్పుడు సీరియల్ హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు కోలీవుడ్ సీరియల్స్‌లో బిజీగా మారింది. ఇటీవల ఓ తెలుగు సీరియల్ కూడా చేసింది. అదే మందాకిని. ఆహా ఓటీటీ వేదికగా సీరియల్స్ స్టార్ట్ చేసిన సంగతి విదితమే. ప్రేమ, సస్పెన్స్ థ్రిల్లర్‌తో కూడిన సీరియల్లే మందాకినీ. మనిషి మేధస్సుకి దైవ శక్తికి మధ్య సంఘర్షణే ఈ ధారావాహిక.

ఇందులో టైటిల్ రోల్‌లో నటించింది హిమ బిందు. మందాకిని పాత్రలో మెస్మరసైజ్ చేసింది. గత ఏడాది మార్చిలో ప్రసారమైంది ఈ సీరియల్. సోమవారం నుండి గురువారం వరకు మధ్యాహ్నం 2.30 గంటలకు వచ్చేది ఈ సీరియల్. ఈ సీరియల్లో జయలలిత, సాయి కిరణ్, భావన, వర్ష వంటి నటులు యాక్ట చేశారు. కాగా, హిమబిందు అంతకు ముందు ఇధయతై తిరుడతేలో కూడా నటించింది. ఇందులో సహనా అనే పాత్రను పోషించింది. అలాగే ఇలాకియా, ధర్మపత్ని అనే ధారావాహికల్లో కూడా నటించింది. సోషల్ మీడియాలో ఎప్పుడు బిజీగా ఉంటే ఈ బ్యూటీ.. తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో స్పష్టంగా మాట్లాడుతుంది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది అమ్మడికి. ఫోటో షూట్లతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇక బుల్లితెర నుండి వెండితెరపైకి ఎంతో మంది బ్యూటీస్ వస్తున్నారు. ఈ అమ్మాయి కూడా త్వరలో వెండితెరపైకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి