iDreamPost

Sanju Samson: ఆ ఇద్దరి వ్యూహాల వల్లే గెలిచాం.. విజయం తర్వాత శాంసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఆర్సీబీపై విజయం సాధించడంలో ఆ ఇద్దరే కీలక పాత్ర పోషించారని, వారి వ్యూహాల కారణంగానే ఈ మ్యాచ్ లో విజయం సాధించామని ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. మరి ఆ ఇద్దరు ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ 2024లో రాజస్తాన్ రాయల్స్ దిగ్విజయంగా దూసుకెళ్తోంది. లీగ్ స్టేజ్ లో చూపించిన ఫామ్ నే నాకౌట్ మ్యాచ్ లో కూడా కొనసాగిస్తోంది. తాజాగా ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించి.. క్వాలిఫయర్ 2లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఆర్సీబీపై విజయం సాధించడంలో ఆ ఇద్దరే కీలక పాత్ర పోషించారని, వారి వ్యూహాల కారణంగానే ఈ మ్యాచ్ లో విజయం సాధించామని ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. మరి ఆ ఇద్దరు ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

క్రికెట్ లో జట్టు విజయం సాధించాలంటే.. ఆటగాళ్లందరూ సమష్టిగాా రాణించాలి. ఏ ఒక్కరో రాణిస్తే.. టీమ్ విజయం సాధించలేదు. ఇక ప్రత్యర్థిని దెబ్బకొట్టాలంటే.. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పకడ్బందీగా సిద్ధం చేసుకోవాలి. లేకపోతే.. టీమ్ కు విజయాలు దక్కవు. తాజాగా ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీపై విజయం సాధించడంలో ఆ ఇద్దరి లెజెండ్స్ వ్యూహాలు ఎంతగానే పనిచేశాయని చెప్పుకొచ్చాడు శాంసన్.

ఆర్సీబీపై విజయం తర్వాత శాంసన్ మాట్లాడుతూ..”ఈ మ్యాచ్ లో మేము ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతంగా రాణించాం. ఈ విక్టరీ క్రెడిట్ బౌలర్లతో పాటుగా హెడ్ కోచ్ కుమార సంగక్కర, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ కు ఇవ్వాలి. ఈ ఇద్దరి లెజెండ్స్ వ్యూహాల కారణంగానే ఆర్సీబీపై విజయం సాధించాం. హోటల్ రూమ్స్ లో గంటల కొద్ది వ్యూహాలు రచించేది ఈ ఇద్దరే. వారి కారణాంగానే జట్టు విజయాల బాటలో పయణిస్తోంది” అంటూ చెప్పుకొచ్చాడు శాంసన్. కాగా.. రాజస్తాన్ క్వాలిఫయర్ 2లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి