iDreamPost

Aarambham OTT: OTT లోకి వచ్చేసిన తెలుగు సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ ఆరంభం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published May 23, 2024 | 11:27 AMUpdated May 23, 2024 | 11:27 AM

ప్రేక్షకులంతా ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీ టీ వైపు చూస్తున్న క్రమంలో.. ఓటీటీ లో సరి కొత్త కంటెంట్ తో సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీ లో అడుగుపెట్టింది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

ప్రేక్షకులంతా ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీ టీ వైపు చూస్తున్న క్రమంలో.. ఓటీటీ లో సరి కొత్త కంటెంట్ తో సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీ లో అడుగుపెట్టింది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published May 23, 2024 | 11:27 AMUpdated May 23, 2024 | 11:27 AM
Aarambham OTT: OTT లోకి వచ్చేసిన తెలుగు సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ ఆరంభం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తాయా అని మూవీ లవర్స్ అంతా కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రతి వారం ఓటీటీ లోకి కొత్త కొత్త సినిమాలు వస్తున్నా కానీ వాటిలో చూడదగిన సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అందులోను ముఖ్యంగా ముందు తెలుగు సినిమాలు ఏం ఉన్నాయా అని సెర్చ్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఈ క్రమంలోనే ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వబోయే సినిమాలలో ఇతర భాషల సినిమాలతో పాటు.. తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని అసలు మిస్ కాకుండా చూడండి. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ సినిమా అడుగుపెట్టింది.పైగా ఈ సినిమా తెలుగులో కూడా ఉంది, మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా మరేదో కాదు… ఈ సినిమా పేరు “ఆరంభం“. ఈ మధ్య కాలంలో థియేటర్ లో రిలీజ్ అయిన కొన్ని రోజులకే సినిమాలు ఓటీటీ లోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆరంభం సినిమా కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా రెండు వారాలకే ఓటీటీ లోకి అడుగుపెట్టింది. ఆరంభం సినిమా మే 10న థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఇక ఇప్పుడు ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ఓటీటీ లోకి అడుగుపెట్టింది. ఆరంభం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ దక్కించుకోగా.. మే 23 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు.. వెంటనే ఓటీటీ లో చూసేయండి.

Aarambham Movie

ఇక ఆరంభం సినిమా కథ విషయానికొస్తే.. ఓ మర్డర్ కేస్ లో భాగంగా రెండున్నర ఏళ్లుగా కాలాఘాటి జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు మిగిల్ అనే వ్యక్తి. మరుసటి రోజు తనని ఉరితీస్తారు అనగా.. అదే సమయంలో జైలు నుంచి ఎస్కేప్ అవుతాడు. వేసిన తాళాలు వేసినట్లే ఉంటాయి.. ఆ సెల్ లో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. అయినా కానీ ఆ వ్యక్తి ఎలా తప్పించుకున్నాడు అనేది ఎవరికీ అర్ధం కాదు. వారికి ఏమి అర్థంకాక ఆ కేసును సాల్వ్ చేయడం కోసం.. ఓ డిటెక్టివ్ ను పిలిపిస్తారు. ఈ క్రమంలో ఆ సెల్ లో మిగిల్ రాసుకున్న ఓ పుస్తకం కనిపిస్తుంది. ఆ పుస్తకంలో తాను చిన్నపటినుంచి ఓ వ్యక్తి దగ్గర పెరిగాడని, అతను ఒక దేజవు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడని, వాటితో పాటు అతనికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఉంటాయి. అసలు ఆ వ్యక్తి ఎవరు ? అతని కథ ఏంటి ? దేజవు అనే ఈ సరికొత్త ప్రయోగం ఏంటి ? అతను జైల్లో నుంచి ఎలా తప్పించుకున్నాడు ? డిటెక్టివ్ ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి