iDreamPost
android-app
ios-app

సెమీస్​లో ఇండియా దాటాల్సిన 5 సవాళ్లు! మూడోది చాలా డేంజర్!

  • Author singhj Published - 03:51 PM, Mon - 13 November 23

వరల్డ్ కప్​లో లీగ్ మ్యాచులు పూర్తవ్వడంతో ఇప్పుడు అందరి ఫోకస్ సెమీస్​పై పడింది. అయితే నాకౌట్ మ్యాచ్​లో న్యూజిలాండ్​ను చిత్తు చేయాలంటే 5 సవాళ్లను టీమిండియా అధిగమించాల్సి ఉంటుంది.

వరల్డ్ కప్​లో లీగ్ మ్యాచులు పూర్తవ్వడంతో ఇప్పుడు అందరి ఫోకస్ సెమీస్​పై పడింది. అయితే నాకౌట్ మ్యాచ్​లో న్యూజిలాండ్​ను చిత్తు చేయాలంటే 5 సవాళ్లను టీమిండియా అధిగమించాల్సి ఉంటుంది.

  • Author singhj Published - 03:51 PM, Mon - 13 November 23
సెమీస్​లో ఇండియా దాటాల్సిన 5 సవాళ్లు! మూడోది చాలా డేంజర్!

వన్డే వరల్డ్ కప్​-2023లో లీగ్ దశను మరో విజయంతో ముగించింది టీమిండియా. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లాస్ట్ లీగ్ మ్యాచ్​లో నెదర్లాండ్స్​పై ఘన విజయం సాధించింది. లీగ్ మ్యాచులు పూర్తవడంతో సెమీస్​ ఫైట్​పై భారత్ ఫోకస్ చేస్తోంది. కివీస్​ను చిత్తు చేసి మెగా టోర్నీ ఫైనల్స్​కు దూసుకెళ్లాలని భావిస్తోంది. అయితే నాకౌట్ మ్యాచ్​లో రోహిత్ సేన 5 సవాళ్లను దాటాల్సి ఉంటుంది. అందులో మూడో ఛాలెంజ్ మిగతా వాటి కంటే చాలా డేంజర్ అనే చెప్పాలి. వీటిని అధిగమిస్తేనే ఫైనల్ బెర్త్ ఖరారు అవుతుంది. భారత్ ముందున్న సవాళ్లలో మొదటిది న్యూజిలాండ్ బ్యాటింగ్ బలం. టోర్నీలో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్స్​లో కివీస్ ఒకటి. ఈ వరల్డ్ కప్​లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లలో ఇద్దరు ఈ జట్టులోనే ఉన్నారు.

యంగ్ సెన్సేషన్ రచిన్ రవీంద్ర (565 రన్స్), డారిల్ మిచెల్ (418 రన్స్) న్యూజిలాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా రచిన్ అయితే ప్రపంచ కప్​లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. లీగ్ దశలో భారత్​తో జరిగిన మ్యాచులోనూ రచిన్, డారిల్​లు అద్భుతంగా రాణించారు. ఆ మ్యాచ్​లో డారిల్ సెంచరీ బాదాడు. వీళ్లిద్దరితో పాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్, మార్క్ చాప్​మన్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ రూపంలో క్వాలిటీ బ్యాటర్లు ఆ టీమ్​లో ఉన్నారు. ఆల్​రౌండర్లు మిచెల్ శాంట్నర్, లాకీ ఫెర్యూసన్ బాల్​తో పాటు బ్యాట్​తోనూ విలువైన రన్స్ చేయగలరు. కాబట్టి కివీస్ బ్యాటర్లను సాధ్యమైనంత తక్కువ స్కోరుకు కట్టడి చేయడం భారత్​కు ఛాలెంజింగ్ అనే చెప్పాలి.

సెమీస్ మ్యాచ్​లో టీమిండియాను భయపెడుతున్న మరో భయం ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్. లెఫ్టార్మ్ పేసరైన బౌల్ట్ బాల్​ను రెండు వైపులా స్వింగ్ చేయగలడు. సెమీస్​కు హోస్ట్​గా ఉన్న ముంబైలోని వాంఖడే వికెట్​ నుంచి ఏ కాస్త మద్దతు దొరికినా భారత్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేందుకు బౌల్ట్ సిద్ధంగా ఉంటాడు. లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోవడంలో టీమిండియా బ్యాట్స్​మెన్ వీక్ అనే చెప్పాలి. అందులోనూ బాల్​ను స్వింగ్ చేసే బౌల్ట్ లాంటి వారిని ఫేస్ చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడతారు. భారత్​పై బౌల్ట్​కు అద్భుత రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో అతడు విసిరే సవాల్​ను మన బ్యాటర్లు ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి. సెమీస్​ మ్యాచ్​లో రోహిత్ సేనను భయపెడుతున్న అతి పెద్ద భయం బ్యాడ్ రికార్డు.

భారత బ్యాటింగ్ మూలస్థంభాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి వరల్డ్ కప్ సెమీస్​లో మంచి రికార్డు లేదు. నాకౌట్ మ్యాచుల్లో కోహ్లీ యావరేజ్ 3.7గా ఉంది. అదే హిట్​మ్యాన్ బ్యాటింగ్ యావరేజ్ 17.5గా ఉంది. ఒకవేళ ఈసారి కూడా అదే రిపీటైతే భారత్ పనైపోయినట్లే. ఈ చెత్త రికార్డును రోహిత్​, కోహ్లీ అధిగమించాల్సి ఉంటుంది. టీమిండియా దాటాల్సిన మరో ఛాలెంజ్​గా న్యూజిలాండ్ పోరాట పటిమను చెప్పొచ్చు. గత రెండు వరల్డ్ కప్స్​లోనూ ఫైనల్​కు చేరుకుంది కివీస్. క్రేజ్ ఉన్న స్టార్ ప్లేయర్లు ఎవరూ జట్టులో లేకపోయినా అందరి ఎక్స్​పెక్టేషన్స్​ను తలకిందులు చేస్తూ సెమీస్​ మ్యాచుల్లో నెగ్గి ఫైనల్​కు వెళ్లింది. ఛాంపియన్ టీమ్ ఆస్ట్రేలియా మాదిరిగానే ఓటమిని ఒప్పుకోకపోవడం న్యూజిలాండ్ జట్టు ప్రత్యేకత అని చెప్పొచ్చు.

మ్యాచ్​లో ఏ దశలోనూ వెనుకబడినా సరే.. తిరిగి పుంజుకొని పట్టు సాధించడం కివీస్​కు అలవాటుగా మారింది. పోరాటం సాగిస్తూనే ఉండటం, పట్టు వదలకపోవడం, ఆఖరి వరకు ఓటమిని ఒప్పుకోకపోవడం ఆ జట్టు అతిపెద్ద బలమని చెప్పొచ్చు. సెమీస్​ ఫైట్​లో భారత్​ను ఆందోళన పరిచే మరో అంశం ఒత్తిడి. సొంత ఆడియెన్స్ మధ్య ఆడటం, ఫైనల్​కు చేరుకోవాలనే ఒత్తిడి మధ్య కివీస్​ లాంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడం ఈజీ కాదు.  ఈ సవాల్​ను కూడా భారత్ అధిగమించాలి. కెప్టెన్ రోహిత్ శర్మ ఒత్తిడికి చిత్తవ్వకుండా కరెక్ట్ డెసిజన్స్ తీసుకుంటూ, సరైన బౌలింగ్, ఫీల్డింగ్ మార్పులు చేస్తూ.. బ్యాటింగ్​లోనూ టీమ్​ను ముందుండి నడిపితేనే టీమిండియా ఫైనల్​కు చేరుకోగలదు. మరి.. కివీస్ నుంచి పొంచి ఉన్న సవాళ్లపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అంతా బాగానే ఉంది.. కానీ ఆ ఒక్క విషయంలోనే ద్రవిడ్ వెనుకబడ్డాడా?