iDreamPost

అంతా బాగానే ఉంది.. కానీ ఆ ఒక్క విషయంలోనే ద్రవిడ్ వెనుకబడ్డాడా?

  • Author singhj Published - 12:28 PM, Mon - 13 November 23

వరల్డ్ కప్​లో భారత్ వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసింది. అయితే అంతా బాగానే ఉన్నా ఆ ఒక్క విషయంలో మాత్రం టీమ్ వెనుకబడింది. కోచ్ రాహుల్ ద్రవిడ్ సరైన ప్లానింగ్ చేయని కారణంగా ఆ విషయంలో జట్టు వీక్​గా కనిపిస్తోందని అనలిస్టులు అంటున్నారు.

వరల్డ్ కప్​లో భారత్ వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసింది. అయితే అంతా బాగానే ఉన్నా ఆ ఒక్క విషయంలో మాత్రం టీమ్ వెనుకబడింది. కోచ్ రాహుల్ ద్రవిడ్ సరైన ప్లానింగ్ చేయని కారణంగా ఆ విషయంలో జట్టు వీక్​గా కనిపిస్తోందని అనలిస్టులు అంటున్నారు.

  • Author singhj Published - 12:28 PM, Mon - 13 November 23
అంతా బాగానే ఉంది.. కానీ ఆ ఒక్క విషయంలోనే ద్రవిడ్ వెనుకబడ్డాడా?

వన్డే ప్రపంచ కప్-2023లో టీమిండియా సూపర్ ఫామ్​లో ఉంది. లీగ్ దశను మరో భారీ విక్టరీతో ముగించింది. లీగ్ స్టేజ్​లో ఆడిన తొమ్మిదికి 9 మ్యాచుల్లోనూ నెగ్గి సెమీస్​కు వెళ్తోంది భారత్. నెదర్లాండ్స్​తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన వన్డేలో 160 రన్స్ తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన రోహిత్ సేన అన్ని ఓవర్లాడి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (61), శుబ్​మన్ గిల్ (51), విరాట్ కోహ్లీ (51) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) సెంచరీలతో అదరగొట్టారు. అనంతరం ఛేజింగ్​కు దిగిన డచ్ టీమ్ 47.5 ఓవర్లలో 250 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

టీమిండియా బౌలర్లలో జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్​తో పాటు కుల్​దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు తలో రెండు వికెట్లు తీశారు. కోహ్లీ, కెప్టెన్ రోహిత్​ చెరో వికెట్​తో మెరిశారు. అయితే పేసర్ మహ్మద్ షమీకి వికెట్ దక్కలేదు. ఈ మ్యాచ్​లో ఏకంగా 9 మంది ప్లేయర్లతో బౌలింగ్ చేయించాడు హిట్​మ్యాన్. రెగ్యులర్ బౌలర్లలో సిరాజ్, షమీతో ఆరేసి ఓవర్లు మాత్రమే వేయించాడు. ఈ పేసర్లకు రెస్ట్ ఇచ్చిన రోహిత్.. బుమ్రాతో మాత్రం 9 ఓవర్లు బౌలింగ్ చేయించాడు. స్పిన్నర్లను కూడా ఫుల్ కోటా వేసేలా చేశాడు. అలాగే కోహ్లీ, గిల్, సూర్యకుమార్​లతోనూ బౌలింగ్ వేయించాడు. శుబ్​మన్ వికెట్ తీయకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. పార్ట్ టైమర్లలో విరాట్ అందరికంటే బాగా ఆకట్టుకున్నాడు. అతడ్ని ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి బ్యాటర్లు తడబడ్డారు.

నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో 9 మందితో బౌలింగ్ చేయించాలనే రోహిత్-ద్రవిడ్ ప్రయోగం కొంతమేర సక్సెస్ అయింది. హిట్​మ్యాన్, కోహ్లీ ఒక్కో వికెట్ తీశారు. గిల్, సూర్యకు కూడా బౌలింగ్ ప్రాక్టీస్ దొరికింది. బౌలింగ్, బ్యాటింగ్​లో మంచి బ్యాలెన్స్ తీసుకొస్తున్న ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా లేకపోవడంతో ఆరో బౌలింగ్ ఆప్షన్ కోసం భారత్ ఈ ప్రయోగం చేసినట్లుగా కనిపిస్తోంది. బుమ్రా, సిరాజ్, షమి, జడేజా, కుల్​దీప్​ల్లో ఎవరైనా ఫెయిలైతే ఆరో బౌలర్​ వచ్చి కొన్ని ఓవర్లు వేసేలా, అవసరమైన టైమ్​లో బ్రేక్ త్రూ ఇచ్చేందుకు ఈ ఆప్షన్ కోసం ప్రయత్నించారు. కానీ ఈ విషయంలో కోచ్ ద్రవిడ్ వెనుకబడ్డాడనే చెప్పాలి.

ఆరో బౌలర్​ను కొన్ని సిరీస్​లకు ముందు నుంచే తయారు చేసుకుంటే బాగుండేది. తీరా వరల్డ్ కప్ సెమీస్​ మ్యాచ్​కు ముందు ఆప్షన్ కోసం వెతుక్కోవడంపై విమర్శలు వస్తున్నాయి. సిక్స్ బౌలింగ్ ఆప్షన్ కోసం కోహ్లీ, గిల్, రోహిత్, సూర్యల్లో నుంచి ఎవరైనా ఇద్దర్నీ ముందు నుంచి ప్రిపేర్ చేయాల్సింది. కొన్ని సిరీస్​ల్లో బౌలింగ్ చేయిస్తే ఈపాటికి వాళ్లు మంచి రిథమ్​లో ఉండేవారని.. ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని అంటున్నారు. కేవలం ఒక్క మ్యాచ్​ ప్రాక్టీస్​తో నాకౌట్ లాంటి తీవ్ర ఒత్తిడి ఉన్న మ్యాచ్​లో పార్ట్ టైమర్లను బౌలింగ్ చేయమనడం ఎంత వరకు కరెక్ట్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఓపెనింగ్, టాపార్డర్, మిడిలార్డర్, కీపింగ్, లోయరార్డర్ అంటూ బ్యాటింగ్ విషయంలో.. పేసర్లు, స్పిన్నర్లు, ఆల్​రౌండర్లు అంటూ బౌలింగ్ విషయంలోనూ ఏడాది ముందు నుంచే పక్కా ప్లానింగ్​తో ఉన్న కోచ్ ద్రవిడ్ పార్ట్ టైమర్లను లైట్ తీసుకున్నాడని అంటున్నారు. హార్దిక్ పాండ్యాపై అతిగా డిపెండ్ అవ్వడం, అతడికి బ్యాకప్ లేకపోవడం, పార్ట్ టైమర్లను తయారు చేసుకోకపోవడం బిగ్ మ్యాచెస్​లో భారత్​ను దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉందని క్రికెట్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ద్రవిడ్ ముందే మేల్కొని సరిగ్గా ప్లాన్ చేసుకొని ఉంటే సరిపోయేదని చెబుతున్నారు. మరి.. పార్ట్ టైమర్ల ప్లానింగ్ విషయంలో ద్రవిడ్ వెనుకబడటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కోహ్లీ గురించి అలా మాట్లాడి తప్పు ఒప్పుకున్న స్టార్‌ క్రికెటర్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి