iDreamPost

పేరెంట్స్ బీ కేర్​ఫుల్.. మీ పిల్లలకు ఈ సిరప్​ అస్సలు ఇవ్వొద్దు!

  • Author singhj Published - 02:21 PM, Tue - 8 August 23
  • Author singhj Published - 02:21 PM, Tue - 8 August 23
పేరెంట్స్ బీ కేర్​ఫుల్.. మీ పిల్లలకు ఈ సిరప్​ అస్సలు ఇవ్వొద్దు!

పిల్లలకు జ్వరం, దగ్గు లేదా జలుబు లాంటివి వస్తే సిరప్​లు తాగిస్తుంటారు. పెద్దలకు ఇచ్చినట్లు సూదులు, ట్యాబ్లెట్స్​ను ఎక్కువగా ఇవ్వరు. ముఖ్యంగా చిన్నారులకు వైద్యులు సిరప్​లు ఇస్తుంటారు. అయితే అధిక లాభాపేక్షతో కొన్ని కంపెనీలు నాసిరకం మందులను తయారు చేస్తున్నాయి. చిన్న పిల్లలకు ఇచ్చే మందుల్లో కూడా నాసిరకంవి వస్తున్నాయి. అలాంటి ఒక నాసిరకం సిరప్​ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) హెచ్చరించింది. ఇండియాలో తయారై ఇరాక్​లో అమ్ముడవుతున్న మరో నాసిరకం సిరప్​పై డబ్ల్యూహెచ్​వో హెచ్చరికలు జారీ చేసింది.

పిల్లలకు సాధారణ జలుబు వచ్చినప్పుడు వాడే కోల్డ్ అవుట్ సిరప్ ఎంతమాత్రం సురక్షితం కాదని డబ్ల్యూహెచ్​వో హెచ్చరించింది. ఈ విషయాన్ని గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన మెడికల్ అలర్ట్​లో తెలిపింది. ఈ కోల్డ్ అవుట్ సిరప్​ను చెన్నైకి చెందిన ఫోర్ట్స్ లాబొరేటరీస్ తయారు చేయగా.. దీని వినియోగం ఇరాక్​లో ఎక్కుగా ఉందని డబ్ల్యూహెచ్​వో పేర్కొంది. ఈ సిరప్ ఎంత మాత్రం సేఫ్ కాదని.. పిల్లలు దీన్ని తాగితే అనారోగ్యానికి గురవుతారని స్పష్టం చేసింది. ఒక్కోసారి ఈ సిరప్ ద్వారా మరణాలు కూడా సంభవించొచ్చని డబ్ల్యూహెచ్​వో హెచ్చరించింది.

కోల్డ్ అవుట్ సిరప్ శాంపిల్స్​ను ల్యాబ్​కు పంపించారు. అక్కడ నిర్వహించిన టెస్టుల్లో ఇందులో డైథైలీన్ గ్లైకాల్ (0.25 శాతం), ఇథిలీన్ గ్లైకాల్ (2.1 శాతం) కలుషితాలు ఉన్నాయని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్​వో తెలిపింది. ఉపయోగించాల్సిన దాని కంటే 0.10 శాతం ఇది అధికంగా ఉన్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటిదాకా కోల్డ్ అవుట్ సిరప్​పై ఇరాక్ అధికారులు ఎలాంటి కంప్లయింట్స్ చేయలేదు. కాగా, గతేడాది ఉజ్బెకిస్థాన్, గాంబియాల్లో పిల్లల మరణాలకు ఇండియాలో తయారు చేసిన దగ్గు మందులతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి