iDreamPost

చిరు వర్సెస్ బాలయ్య.. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు?

ఎక్కువ సార్లు చిరునే పైచేయి సాధించాడు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తో బాలయ్య జోరు మీద ఉన్నాడు. దానికి తోడు అన్ స్టాపబుల్ షోతో అందరికీ చేరువయ్యాడు. దీంతో ఎప్పుడూ లేనంత క్రేజ్ ఆయన తాజా చిత్రం వీరసింహారెడ్డి పై ఏర్పడింది.

ఎక్కువ సార్లు చిరునే పైచేయి సాధించాడు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తో బాలయ్య జోరు మీద ఉన్నాడు. దానికి తోడు అన్ స్టాపబుల్ షోతో అందరికీ చేరువయ్యాడు. దీంతో ఎప్పుడూ లేనంత క్రేజ్ ఆయన తాజా చిత్రం వీరసింహారెడ్డి పై ఏర్పడింది.

చిరు వర్సెస్ బాలయ్య.. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు?

ఈ సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు బరిలోకి దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. గతంలోనూ ఈ ఇద్దరూ అనేకసార్లు బాక్సాఫీస్ వార్ కి దిగగా.. ఎక్కువ సార్లు చిరునే పైచేయి సాధించాడు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తో బాలయ్య జోరు మీద ఉన్నాడు. దానికి తోడు అన్ స్టాపబుల్ షోతో అందరికీ చేరువయ్యాడు. దీంతో ఎప్పుడూ లేనంత క్రేజ్ ఆయన తాజా చిత్రం వీరసింహారెడ్డి పై ఏర్పడింది. మరోవైపు చిరంజీవి మాత్రం గతేడాది ఆచార్య వంటి ఘోర పరాజయాన్ని చూశాడు. ఆ తర్వాత గాడ్ ఫాదర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆయన స్థాయి కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. దీంతో ఆయన తన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య తో మరోసారి తన మార్కెట్ రేంజ్ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈసారి చిరు, బాలయ్య పోరు ఎప్పుడూ లేనంత ఆసక్తికరంగా మారింది.

జనవరి 12న వీరసింహారెడ్డి విడుదలైంది. అఖండ, అన్ స్టాపబుల్ ప్రభావం, దానికితోడు సోలో రిలీజ్.. ఇంకేముంది మొదటిరోజు బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే రెండో రోజు జనవరి 13న వాల్తేరు వీరయ్య రాకతో వీరసింహారెడ్డి దూకుడుకి బ్రేకులు పడ్డాయి. దీంతో రెండో రోజు రూ.11 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది. మూడో రోజు భోగి కావడంతో పుంజుకుంటుంది అనుకుంటే.. రూ.12 కోట్ల గ్రాస్ కే పరిమితమైంది. మూడు రోజుల్లో ఈ సినిమా 73 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని అంచనా. మరోవైపు వాల్తేరు వీరయ్య కేవలం రెండు రోజుల్లోనే అంతకు మించిన కలెక్షన్స్ రాబట్టడం విశేషం.

అప్పటికే థియేటర్లలో వీరసింహారెడ్డి ఉన్నప్పటికీ.. వాల్తేరు వీరయ్య మొదటిరోజు 49 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. రెండో రోజు కూడా 26 కోట్ల గ్రాస్ తో అంచనాలకు మించిన వసూళ్లతో సంచలనం సృష్టించింది. దీంతో రెండు రోజుల్లోనే ఈ చిత్రం 75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంటే వీరసింహారెడ్డి మూడు రోజుల వసూళ్ల కంటే.. వాల్తేరు వీరయ్య రెండు రోజుల వసూళ్లే ఎక్కువ ఉన్నాయి. దీంతో ప్రస్తుతానికి చిరంజీవినే విన్నర్ అని చెప్పొచ్చు. ఫుల్ రన్ లో కూడా వాల్తేరు వీరయ్యనే పైచేయి సాధించే అవకాశముంది. ఎందుకంటే వీరసింహారెడ్డి రెగ్యులర్ ఫ్యాక్షన్ సినిమాలా ఉందనే టాక్ తెచ్చుకుంది. పైగా సినిమాలో వైలెన్స్ ఎక్కువ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసే అవకాశాలు చాలా తక్కువ. ఇక వాల్తేరు వీరయ్య కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అయినప్పటికీ చిరంజీవి కామెడీ అదిరిపోయిందనే టాక్ తెచ్చుకుంది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. అందుకే రెండో రోజు నుంచి వీరసింహారెడ్డి కలెక్షన్స్ ఘోరంగా డ్రాప్ అయినా.. వాల్తేరు వీరయ్య మాత్రం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ విన్నర్ అనిపించుకుంటోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి