iDreamPost
android-app
ios-app

‘కల్కి’ మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేస్తే క్రిమినల్ కేసులే!

  • Author Soma Sekhar Published - 03:00 PM, Thu - 21 September 23
  • Author Soma Sekhar Published - 03:00 PM, Thu - 21 September 23
‘కల్కి’ మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేస్తే క్రిమినల్ కేసులే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా పాన్ ఇండియా రేంజ్ ను దాటి హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు లీకయ్యాయంటూ తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. కల్కి సినిమాకు సంబంధించి ఎలాంటి లీకులు బయటికి వచ్చినా క్రిమినల్ చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

‘కల్కి 2892 ఏడీ’ మేకర్స్ పైరసీ కారులకు, లీక్ వీరులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ చిత్రంలోని కొన్ని సీన్లు లీక్ అయ్యాయని ఇటీవలే సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. కల్కి మూవీకి సంబంధించి ఎలాంటి లీకులు బయటకు వచ్చినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు వైజయంతీ మూవీస్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ ను షేర్ చేసింది. కల్కి మూవీకి సంబంధించిన అన్ని హక్కులు నిర్మాణ సంస్థకు మాత్రమే చెందుతాయని, ఇందులోని ఫొటోలు, వీడియోలు లీక్ చేసినా.. అనధికారికంగా బయటకు వచ్చిన సీన్లను షేర్ చేసినా క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది.

కాగా.. గతంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను లీకైనట్లు వార్తలు వచ్చాయి. సదరు సంస్థపై చిత్ర యూనిట్ లీగల్ గా యాక్షన్ కూడా తీసుకుందంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. ఇక కల్కి చిత్రాన్ని రెండు పార్ట్స్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి వైజయంతీ మూవీస్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetjojobetCasibom girişjojobetJojobet GirişcasibomjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet giriş