iDreamPost

షూటింగ్ లో ప్రమాదం.. 30 ఏళ్లు కోమాలో ఉన్న నటుడు మృతి!

షూటింగ్ లో ప్రమాదం.. 30 ఏళ్లు కోమాలో ఉన్న నటుడు మృతి!

ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు ఇతర రంగాలకు చెందిన కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు అభిమానులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. అనారోగ్యంతో కొంతమంది, రోడ్డు ప్రమాదాలు, కెరీర్ సరిగా లేకపోవడంతో డిప్రేషన్ లోకి వెళ్లి బలవన్మరాణాలు ఇలా ఎన్నో కారణాల వల్ల ఇండస్ట్రీలో విషాదాలు నిండుకుంటున్నాయి. షూటింగ్ ప్రమాదంలో 30 ఏళ్ల క్రితం గాయాలపాలై కోమాలోకి వెళ్లిన ప్రముఖ నటుడు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ మూవీ షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ నటుడు బాబు 30 ఏళ్ల పాటు మంచానికే పరిమితమై ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ప్రముఖ దర్శకులు భారతీరాజా దగ్గర సహాయక దర్శకుడిగా పనిచేసిన బాబు 1990లో వచ్చిన ‘ఎన్ ఉయిర్ తోజన్’ మూవీతో అరంగెట్రం చేశారు. అప్పట్లో ఈ మూవీ మంచి విజయం అందుకొని బాబు కి మంచిపేరు తీసుకు వచ్చింది. తర్వాత తాయమ్మ, పెరుంపుల్లి, పొన్నుకు చేతి వందచు అనే చిత్రాల్లో హీరోగా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు బాబు.

స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న ఆయనకు ‘మనసారా పరిహితంగానే’అనే చిత్రం షూటింగ్ సమయంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఘటన బాబు జీవితాన్ని పూర్తిగా మలుపుతిప్పింది. ఈ మూవీ ప్రారంభమైన కొద్ది రోజుల తర్వాత ఓ ఫైట్ సీన్ చిత్రీకరించారు. ఆ సీన్ లో హీరో ఓ భవనంపై నుంచి దూకాల్సి ఉంటుంది. అయితే ఆ సీన్ డూప్ లేకుండా తాను స్వయంగా చేయాలనే ఉద్దేశంలో ఉన్న బాబు భవనంపై నుంచి దూకారు. కిందకు దూకిన ఆయన పట్టుతప్పి పడిపోవడంతో వెన్నుముకకు తీవ్ర గాయం అయ్యింది. కుటుంబ సభ్యులు ఆయన వెన్నుముకకు శస్త్ర చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఆయన 30 ఏళ్ల పాటు కూర్చోలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై కోమాలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి కన్నుమూశారు. బాబు మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి