iDreamPost

స్వాతంత్య్రం వేళ దుబాయ్ వేదికగా.. పాకిస్తాన్ కు ఘోర అవమానం?

స్వాతంత్య్రం వేళ దుబాయ్ వేదికగా.. పాకిస్తాన్ కు ఘోర అవమానం?

ప్రపంచంలోనే పర్యాటక దేశంలో దుబాయ్ కి ఎంతో మంచి గుర్తింపు ఉంది. సెలబ్రిటీలు, ప్రముఖులు, సినిమా తారలు వెకేషన్ దేశాల లిస్ట్ లో దుబాయ్ కచ్చితంగా ఉంటుంది. అందులోనూ దుబాయ్ లోఉండే అతి పెద్ద కట్టడం బుర్జ్ ఖలీఫాకు ఇంకా మంచి గుర్తింపు ఉంది. ఇటీవలి కాలంలో బుర్జ్ ఖలీఫాకి ఒక ఆనవాయితీ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా దేశం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటే వారికి శుభాకాంక్షలు చెబుతారు. ఆ దేశ జాతీయ పతకాన్ని గౌరవంగా బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శిస్తారు. మిరుమిట్లు గొలిపై విద్యుదీపాలంకరణతో ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతారు.

అందులో భాగంగానే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న భారతదేశానికి కూడా బుర్జ్ ఖలీఫాపై సగర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఒక రోజు ముందే స్వాతంత్ర్యాన్ని పొందిన పాకిస్తాన్ జెండాని కూడా బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శిస్తారని వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్న పాకిస్తానీయులకు మాత్రం భగపాటు తప్పలేదని చెబుతున్నారు. ఎందుకంటే బుర్జ్ ఖలీఫాపై వారి జాతీయ జెండాను ఆవిష్కరించలేదని నెట్టింట ప్రచారం జరగుతోంది. ఇందుకు సంబంధించి దుబాయ్ అధికారులపై పాకిస్తాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

బుర్జ్ ఖలీఫాపై తమ దేశ జెండా ఆవిష్కృతమవుతుందని.. అది లైవ్ చూడాలి అని వేల సంఖ్యలో పాకిస్తాన్ ప్రజలు అక్కడకు చేరుకుంటే వారికి అవమానం జరిగింది అంటూ చెబుతున్నారు. సమయం అర్ధరాత్రి 12 గంటలు దాటినా.. అక్కడ వారి దేశ జెండాను ఆవిష్కరించలేదని చెబుతూ ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో పాకిస్తాన్ జిదాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. వైరల్ వీడియోలో అక్కడ జరిగిన ఘటనను ఒక యువతి వివరిస్తూ ఉంది. “ఫ్రెండ్స్ సమయం 12 గంటలు దాటి ఒక నిమిషం అయింది. పాకిస్తాన్ అధికారులు ఏం చెబుతున్నారంటే.. బుర్జ్ ఖలీఫాపై పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడం లేదని చెబుతున్నారు. పాకిస్తాన్ మిత్రులు ప్రాంక్ అయిపోయింది ఇంక వెళ్లండి” అంటూ ఆ యువతి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే బుర్జ్ ఖలీఫాపై పాకిస్తాన్ జెండాను ప్రదర్శించారంటూ కూడా కొందరు వాదిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి