iDreamPost

పెళ్లి వేదికపై వధువు వింత ప్రవర్తన! దేశం అంతా వైరల్ అవుతున్న వీడియో!

నేడు సోషల్ మీడియా కాలం. ఏ వీడియో ఎప్పుడు ట్రెండింగ్ అవుతుందో చెప్పలేం. కుప్పలు తెప్పలుగా వీడియోలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిల్లో కొన్ని మాత్రమే వైరల్ అవుతున్నాయి.అలాంటి వీడియోనే ఇది

నేడు సోషల్ మీడియా కాలం. ఏ వీడియో ఎప్పుడు ట్రెండింగ్ అవుతుందో చెప్పలేం. కుప్పలు తెప్పలుగా వీడియోలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిల్లో కొన్ని మాత్రమే వైరల్ అవుతున్నాయి.అలాంటి వీడియోనే ఇది

పెళ్లి వేదికపై వధువు వింత ప్రవర్తన!  దేశం అంతా వైరల్ అవుతున్న వీడియో!

సోషల్ మీడియా వచ్చాక ఏ వీడియో ఎప్పుడు, ఎలా, ఎందుకు వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. కొన్ని కోపాన్ని తెప్పిస్తుంటే.. కొన్ని బాధను కలిగిస్తుంటాయి. మరికొన్ని నవ్వు ఆపుకోలేనంతగా నవ్విస్తుంటాయి. మరికొన్ని ఆలోచింప చేసే విధంగా ఉంటాయి.ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో రోజుకు లక్షల కొద్దీ కొత్త వీడియోలు పుట్టుకొస్తున్నాయి. వాటిల్లో బాగా అలరిస్తున్నాయి కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్ వీడియోలు. అవి క్రియేట్ చేస్తున్నారో లేక.. ఫ్రాంకో, రియల్‌గా జరుగుతున్న ఘటనలు రికార్డు చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టడంతో పాటు నవ్వులు పువ్వులు పూయిస్తుంది.

ఇది ఓ పెళ్లి వీడియో. .అందులో కాబోయే భార్యకు వరమాల వేయడానికి పెళ్లి కొడుకు రెడీగా ఉంటాడు. అంతలో భార్య వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది.  కళ్లు ఒక వైపు తిప్పి.. బిగ్గరగా నవ్వుతుంది. వేదికపైనే కుర్చీ వెనుక ఉన్న వ్యక్తి ఆమెను తడుతుంటాడు. పెళ్లి కొడుకు ఆమె వింత ప్రవర్తన చూసి పాగల్ అని అంటుంటాడు. అంతలో ఒక్కసారిగా ఆ అమ్మాయి విదిలించుకుంటుంది. అంతే పెళ్లి కొడుకు భయంతో కింద పడిపోతాడు. వెనక నుండి తడుతున్న వ్యక్తి కూడా ఒక్కసారిగా భయపడిపోతాడు. అతడి ఎక్స్ ప్రెషన్స్, అక్కడి సిచ్యుయేషన్ చూస్తుంటే నవ్వు ఆపుకోవడం కష్టం. రవిశంకర్ వర్మ అనే ట్విట్టర్ ఖాతా దారుడు ఈ వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు.

అంతలో పెళ్లి కూతుర్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. విడిచిపించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. వెనుక నుండి పెళ్లి కొడుకు భయపడిపోతూ ఉంటాడు. కాగా, ఈ వీడియోను చూసిన చాలా మంది పాపం పెళ్లి కొడుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది ఇది ఫేక్ వీడియో అని క్రియేటివ్ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది నిజంగానే ఆ అమ్మాయికి భూతం పట్టిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది స్క్రిప్టెడ్ అని తెలుస్తోంది. ఇదొక ఫ్రాంక్ వీడియో అని కూడా నెటిజన్లు అంటున్నారు. ఏదీ ఏమైనప్పటికీ నెటిజన్లు మాత్రం తమ చేతికి పని చెబుతున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది. ఫుల్ ఫన్నీగా అనిపిస్తున్న ఈ వీడియోను మీరు చూసి ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి