iDreamPost

RCB vs RR: రాజస్తాన్ పై ఓటమి.. IPLకు వీడ్కోలు పలికిన స్టార్ క్రికెటర్!

రాజస్తాన్ పై ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ స్టార్ క్రికెటర్.. తన ఐపీఎల్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాజస్తాన్ పై ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ స్టార్ క్రికెటర్.. తన ఐపీఎల్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

RCB vs RR: రాజస్తాన్ పై ఓటమి.. IPLకు వీడ్కోలు పలికిన స్టార్ క్రికెటర్!

17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన టీమ్ ఏదంటే? చాలా మంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అనే చెబుతారు. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయింది. ఈ సీజన్ లో అయిన అందని ద్రాక్షగా ఉన్నా టైటిల్ ను అందుకోవాలని ముచ్చటపడింది. కానీ ప్లే ఆఫ్స్ నుంచే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. నిన్న(బుధవారం) రాజస్తాన్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది ఆర్సీబీ. ఇక ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఓ స్టార్ క్రికెటర్ ఐపీఎల్ కు వీడ్కోలు పలికాడు.

ఐపీఎల్ 2024లో ఇంటిదారి పట్టే స్టేజ్ నుంచి అనూహ్యంగా ప్లే ఆఫ్స్ కు చేరి అందరిని ఆశ్చర్యపరిచింది ఆర్సీబీ. కానీ నాకౌట్ మ్యాచ్ లో రాజస్తాన్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. జట్టులో రజత్ పాటిదార్(34), కోహ్లీ(33), లొమ్రోర్(32) పరుగులు చేశారు. మిగతావారు పూర్తిగా విఫలం కావడంతో.. జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. రవిచంద్రన్ అశ్విన్ వరుస బంతుల్లో గ్రీన్(27), మాక్స్ వెల్(0)ను అవుట్ చేయడంతో ఆర్సీబీకి గట్టిదెబ్బ తగిలింది. ఆవేశ్ ఖాన్ 3 వికెట్లతో రాణించాడు.

అనంతరం 173 పరుగుల టార్గెట్ ను 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది రాజస్తాన్. యశస్వీ జైస్వాల్(45), రియాన్ పరాగ్(36) రన్స్ తో రాణించారు. ఇక ఈ సీజన్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ప్లే ఆఫ్స్ కు చేరిన ఆర్సీబీకి ఈసారి కూడా నిరాశే ఎదురైంది. ఇక ఈ ఓటమిని జీర్ణించుకోలేని టీమిండియా స్టార్ ప్లేయర్, ఆర్సీబీ వికెట్ కీపర్ కమ్ ఫినిషర్ దినేశ్ కార్తీక్ తన ఐపీఎల్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. మ్యాచ్ అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇప్పటి  వరకు డీకే 257 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడి 4,842 పరుగులు చేశాడు. ఇందులో 22 అర్ధశతకాలు ఉన్నాయి. డీకే తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం అభిమానులను షాక్ కు గురిచేసింది. మరి దినేశ్ కార్తీక్ సడెన్ గా ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి