iDreamPost

భారీగా తగ్గిన పెట్రోల్- డీజిల్ ధరలు.. ఏకంగా రూ.15.39 వరకు.. కానీ!

Petrol- Diesel Prices Reduced: వాహనదారులకు భారీ ఊరటను ఇచ్చే విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేంటంటే.. పెట్రోలు- డీజిల్ ధరలు భారీగా తగ్గిపోయాయి. ఏకంగా పెట్రోల్ లీటరుకు రూ.15 తగ్గింది. డీజిల్ కూడా లీటరుకు రూ.7.88 తగ్గింది.

Petrol- Diesel Prices Reduced: వాహనదారులకు భారీ ఊరటను ఇచ్చే విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేంటంటే.. పెట్రోలు- డీజిల్ ధరలు భారీగా తగ్గిపోయాయి. ఏకంగా పెట్రోల్ లీటరుకు రూ.15 తగ్గింది. డీజిల్ కూడా లీటరుకు రూ.7.88 తగ్గింది.

భారీగా తగ్గిన పెట్రోల్- డీజిల్ ధరలు.. ఏకంగా రూ.15.39 వరకు.. కానీ!

పెట్రోలు, డీజిల్ ధరలు ఎప్పుడూ మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని అందరికీ తెలిసిందే. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయంటే ప్రత్యక్షంగా వాహనదారులు ఇబ్బంది పడతారు. పరోక్షంగా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు. అందుకే ఎప్పుడెప్పుడు వీటి ధరలు తగ్గుతాయా అని అంతా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వారికి అదిరిపోయే శుభవార్త దొరికింది. అదేంటంటే.. పెట్రోలు, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి. ఏకంగా పెట్రోలు లీటరుకు రూ.15.39 తగ్గింది. డీజిల్ పై లీటరుకు రూ.7.88 తగ్గించింది. అయితే ఇవన్నీ మన దగ్గర అని సంతోష పడకండి. ఇదంతా జరిగింది పాకిస్తాన్ దేశంలో.. మన దగ్గర కాదు.

పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశ పౌరులకు శుభవార్తను అందించింది. అసలే నిత్యావసరాల ధరలు పెరిగిపోయి నానా ఇబ్బందులు పడుతున్న పౌరులకు పెట్రోలు, డీజిల్ ధరల నుంచి కాస్త ఉపశమనాన్ని అందించింది. ఏకంగా పెట్రోలుపై లీటరుకు రూ.15.39 తగ్గించింది. అలాగే డీజిల్ పై లీటరుకు రూ.7.88 తగ్గింపు ప్రకటించింది. ఈ వార్త విన్న పాకిస్తాన్ పౌరులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే మనకంటే తక్కువకే పెట్రోలు- డీజిల్ వారికి దొరుకుతుందేమో అని కంగారు పడకండి. ఇంత తగ్గించినా కూడా అక్కడ రేట్లు గూబ గుయ్యి మనేలాగే ఉన్నాయి. లీటరు పెట్రోలు ధర రూ.273, లీటరు డీజిల్ ధర రూ.274గా ఉంది.

ఈ ధరలు తగ్గించడానికి ప్రధాన కారణం ఏంటంటే.. గత 15 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టాయి. గత 15 రోజుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్రోల్ ధర బ్యారెల్ కు 8.7 డాలర్లు, డీజిల్ బ్యారల్ ధర 4.3 డాలర్లు తగ్గింది. ఈ ధరల తగ్గడం వల్లే పాకిస్తాన్ లో ధరలు తగ్గాయి. ఆ విషయాన్ని పాకిస్తాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిన నేపథ్యంలోనే దేశంలో పెట్రోలు- డీజిల్ ధరలు తగ్గించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే పాకిస్తాన్ లో ఈ తరహా ధరలు ఉండటానికి ఇంకో ప్రధాన కారణం ఏంటంటే అక్కడ వసూలు చేసే పన్నులు.

పీడీఎల్(పెట్రోలియం డెవలప్మెంట్ లేవీ) పేరిట ఇప్పటికే లీటరుకు ఏకంగా రూ.60 వసూలు చేస్తోంది. ఈ పన్నుల రూపంలో ఇప్పటికే పాక్ ప్రభుత్వం 9 నెలల్లో రూ.720 బిలియన్లు వసూలు చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.869 బిలియన్స్ వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అందరూ ఇండియన్ ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గుతున్నప్పటికీ ఇండియాలో మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడం లేదు. ఇటీవల కేంద్రం లీటరుకు రూ.2 తగ్గించింది. అది కూడా ఎన్నికల నేపథ్యంలో తగ్గించారంటూ వార్తలు వచ్చాయి. మరోసారి ధరలు తగ్గుతాయనే సూచనలు కూడా కనిపించడం లేదు. మరి.. పాకిస్తాన్ పెట్రోల్- డీజిల్ ధరలు తగ్గడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి