iDreamPost

త్వరలో నటి వరలక్ష్మి వివాహం.. ఆమె కాబోయే భర్తకు ఇంత పెద్ద కూతురు ఉందా?

  • Published Jun 17, 2024 | 9:04 PMUpdated Jun 17, 2024 | 9:04 PM

టాలీవుడ్​లో తక్కువ టైమ్​లోనే స్టార్ స్టేటస్​ను అందుకుంది నటి వరలక్ష్మి శరత్​కుమార్. అందం, అభినయంతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈమె త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది.

టాలీవుడ్​లో తక్కువ టైమ్​లోనే స్టార్ స్టేటస్​ను అందుకుంది నటి వరలక్ష్మి శరత్​కుమార్. అందం, అభినయంతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈమె త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది.

  • Published Jun 17, 2024 | 9:04 PMUpdated Jun 17, 2024 | 9:04 PM
త్వరలో నటి వరలక్ష్మి వివాహం.. ఆమె కాబోయే భర్తకు ఇంత పెద్ద కూతురు ఉందా?

సినీ ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. స్టార్ కిడ్స్​కు కూడా ఇది సవాల్​తో కూడుకున్నది. వారసులకు మూవీ ఆఫర్స్ ఈజీగా వస్తాయి. కానీ కెరీర్​లో వాళ్లను నిలబెట్టేది టాలెంట్ మాత్రమే. వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకోవాలి. ప్రతిభను నిరూపించుకుంటేనే క్రేజ్ దక్కుతుంది. అయితే ఇండస్ట్రీలో కొందరు మాత్రం ఓవర్​నైట్ స్టార్స్ అయిపోతారు. వస్తూ వస్తూనే వరుస విజయాలతో హల్​చల్ చేస్తారు. ప్రముఖ నటి వరలక్ష్మి శరత్​కుమార్ ఇదే కోవలోకి వస్తుంది. తక్కువ టైమ్​లోనే ఆమె మంచి పాపులారిటీ సంపాదించింది. తమిళ సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తెలుగులో స్టార్​డమ్ సంపాదించింది. రవితేజ, బాలకృష్ణ వంటి పెద్ద హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీ యాక్ట్రెస్​గా మారింది. వరుస ప్రాజెక్ట్​ల్లో యాక్ట్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలో పెళ్లి పీటలెక్కనుంది.

జూన్ నెల 2వ తేదీన వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది వరలక్ష్మి శరత్​కుమార్. బాయ్​ఫ్రెండ్ నికోలాయ్ సచ్​దేవ్​ను ఆమె పెళ్లాడనుంది. వీరి మ్యారేజ్​కు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ అయిన నికోలాయ్​కు సొంతంగా ఆర్ట్ గ్యాలరీ బిజినెస్ ఉంది. అక్కడికి తరచుగా బాలీవుడ్​తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీల ప్రముఖులు కూడా వస్తుంటారట. నికోలాయ్-వరలక్ష్మి ఫస్ట్ టైమ్ అక్కడే కలుసుకున్నారట. క్రమంగా పరిచయం పెరగడంతో వాళ్లిద్దరూ స్నేహితులు అయ్యారట. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారడం.. ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చిందని తెలిసింది. అయితే వరలక్ష్మి కాబోయే భర్తకు సంబంధించి ఇప్పుడో విషయం వైరల్ అవుతోంది.

వరలక్ష్మి కాబోయే భర్త నికోలాయ్​కు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. అదేంటంటే.. నికోలాయ్​కు ఆల్రెడీ పెళ్లి అయింది. అతడికి ఓ కుమార్తె కూడా ఉంది. ఆమె వయసు ఇప్పుడు 17 ఏళ్లు కావడం గమనార్హం. నికోలాయ్ కుమార్తె పేరు కషా. ఆమెతో వరలక్ష్మి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ వరలక్ష్మి కాబోయే భర్తకు ఇంత పెద్ద కుమార్తె ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నికోలాయ్ డాటర్ కషా క్రీడా రంగంలో రాణిస్తోంది. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్​షిప్​లో గతేడాది ఆమె గోల్డ్ మెడల్ సాధించడం విశేషం. పవర్ లిఫ్టింగ్​లో చిన్నప్పటి నుంచి ట్రెయినింగ్ తీసుకుంటున్న కషా.. ఈ రంగంలో మరింత ఉన్నత స్థానాలకు వెళ్లాలని అనుకుంటోంది.

 

View this post on Instagram

 

A post shared by Fukkard (@fukkard)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి