iDreamPost
android-app
ios-app

వ్యక్తి అకౌంట్లో అకస్మాత్తుగా రూ.9,900 కోట్లు.. ఎక్కడంటే?

  • Published May 19, 2024 | 11:14 AMUpdated May 19, 2024 | 11:14 AM

Uttar Pradesh: ఇటీవల కొన్ని బ్యాంకులు చేస్తున్న పొరపాటు వల్ల కొంతమంది కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకస్మాత్తుగా అకౌంట్ లో కోట్ల డబ్బులు జమచేయడం.. చేసిన పొరపాటు సరిదిద్దుకోవడం కామన్ అయ్యింది.

Uttar Pradesh: ఇటీవల కొన్ని బ్యాంకులు చేస్తున్న పొరపాటు వల్ల కొంతమంది కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకస్మాత్తుగా అకౌంట్ లో కోట్ల డబ్బులు జమచేయడం.. చేసిన పొరపాటు సరిదిద్దుకోవడం కామన్ అయ్యింది.

  • Published May 19, 2024 | 11:14 AMUpdated May 19, 2024 | 11:14 AM
వ్యక్తి అకౌంట్లో అకస్మాత్తుగా రూ.9,900 కోట్లు.. ఎక్కడంటే?

ప్రతి మనిషి డబ్బుకోసం ఎంతో కష్టపడుతుంటారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ ధనవంతులు కావాలనే కోరిక ఉంటుంది. అందు కోసం ఎన్నో పనులు చేస్తూ నూటిలో ఒక్కరు ఇద్దరు మాత్రమే తాము కన్న కల సాకారం చేసుకుంటారు. ఒక్కసారే లక్షాధికారి, కోటీశ్వరులు కావాలనే ఉద్దేశంతో అక్రమ మార్గాలు ఎంచుకుంటారు. మరికొంత మంది లాటరీలు కొని రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కంటుంటారు. లక్షల్లో ఒకరు ఇద్దరికి మాత్రమే ఆ అదృష్టం కలిసి వస్తుంది. ఈ మధ్య కొన్ని బ్యాంకులు చేస్తున్న పొరపాట్ల వల్ల అకౌంట్లోకి లక్షలు, కోట్లు జమ అవుతుంటాయి. ఒక్కసారి అంత అమౌంట్ అకౌంట్ లోకి పడటంతో కస్టమర్లు షాక్ కి గురి అవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లోని బదోహి జిల్లాలో భాను ప్రకాశ్ అనే వ్యక్తికి స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా లో కిసాన్ క్రెడిట్ కార్డులో లోన్ అకౌంట్ ఉంది. బ్యాంక్ దృష్టిలో ఈ అకౌంట్ ఎన్‌పీఏగా మారింది. ఈ క్రమంలో తలెత్తిన సాఫ్ట్ వేర్ లోపం కారణంగా అతడి అకౌంట్ లో ఏకంగా రూ.99,99,94,95,999.99 కనిపించడంతో మనోడి మౌండ్ బ్లాక్ అయ్యింది. ముందుగా అది ఏదో నెంబర్ అనుకొని పట్టించుకోలేదు.. తర్వాత కుటుంబ సభ్యులకు చూపించడంతో అది నిజమే అన్నారు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన భాను ప్రకాశ్ వెంటనే బ్యాంక్ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే బ్యాంక్ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇది టెక్నికల్ ఇబ్బంది వల్ల జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ సందర్బంగా భాను ప్రకాశ్ మాట్లాడుతూ.. ‘ నా అకౌంట్ లో కోట్ల డబ్బు జమ అయినట్లు కనిపించింది. మొదట ఏదో ఒక నెంబర్ అని భావించాను.. కానీ తర్వాత తెలిసింది. నా అకౌంట్ లో అంత డబ్బు వచ్చి పడిందని తెలియగానే ఎంతో భయపడ్డాను. వెంటనే బ్యాంక్ అధికారులకు ఈ విషయం గురించి చెప్పాను. వెంటనే వారు నా డిటెల్స్ తీసుకొని సరిచేస్తామం’ అని చెప్పారు. బ్యాంక్ మేనేజర్ రోహిత్ గౌతమ్ మాట్లాడుతూ.. సాఫ్ట్ వేర్ లోపం కారణంగా అకౌంట్ లో అంతమొత్తం కనిపించిందని భాను ప్రకాశ్ కి వివరించాం. అకౌంట్ దుర్వినియోగం చేయకుండా ముందుజాగ్రత్త చర్యగా హూల్డ్ లో పెట్టాం’ అని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి