iDreamPost

వీడియో : విజయ్ సేతుపతి కాళ్ళపై పడ్డ దర్శకుడు బుచ్చిబాబు!

  • Published Jun 17, 2024 | 4:51 PMUpdated Jun 17, 2024 | 4:51 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తాజాగా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. ఇక ఈ మూవీ సూపర్ సక్సేస్ బిజీలో ఉన్న విజయ్ సేతుపతికి సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్ గా మారింది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తాజాగా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. ఇక ఈ మూవీ సూపర్ సక్సేస్ బిజీలో ఉన్న విజయ్ సేతుపతికి సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్ గా మారింది.

  • Published Jun 17, 2024 | 4:51 PMUpdated Jun 17, 2024 | 4:51 PM
వీడియో : విజయ్ సేతుపతి కాళ్ళపై పడ్డ దర్శకుడు బుచ్చిబాబు!

కోలీవుడ్ స్టార్ హీరో ‘విజయ్ సేతుపతి’… ప్రస్తుతం ఈయన పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎందుకంటే.. తాజాగా ఈయన ‘మహారాజ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాగా, ఈ సినిమా ఈనెల జూన్ 14వ తేదీన శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమానను నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు.కాగా, ఇందులో మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యపఫ్, అభిరామి కీలక పాత్రలు పోషించారు. అయితే యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసింది.

ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి మూవీ ఆరున్న‌ర కోట్ల‌కుపైగా గ్రాస్‌ను మూడు కోట్ల ఇర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు షేర్‌ను సొంతం చేసుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.ఇలా వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో ఈసినిమా 21.45 కోట్ల క‌లెక్ష‌న్స్ ను కొల్లగొట్టింది. ఇక డిఫరెంట్ కాన్సేప్ట్ తో తెరకెక్కించిన ఈ సనిమా సూపర్ సక్సెస్ ను అందుకోవడంతో.. విజయ్ సేతుపతితో పాటు మూవీ టీమ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కాగా, ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ నులో బిజీగా ఉన్నారు విజయ్ సేతుపతి. అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవతుంది. కాగా, ఆ వీడియోలో విజయ్ సేతుపతి నడుస్తూ వెళ్తుండగా.. ఇంతలో అక్కడికి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కనిపించడంతో ఆయన ఎంతో ప్రేమగా చిన్నా అని పలకరించారు. కానీ అంతలోనే దర్శకుడు బుచ్చిబాబు విజయ్ సేతుపతి పాదాలపై పడి నమస్కారం చేశాడు. దీంతో వెంటనే  విజయ్ సేతుపతి, బుచ్చిబాబును పైకి లేపి అప్యాయంగా ఆయనను గుండెలకు హత్తుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే.. ఈ వీడియోను చూస్తే.. విజయ్ సేతుపతి మహారాజ మూవీ సక్సేస్ మూవీకి సంబంధించినవిగా తెలుస్తుంది.

ఇదిలా ఉంటే.. విజయ్ సేతుపతి, బుచ్చిబాబు డైరెక్షన్ లో ఉప్పెన సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించారు. కాగా, ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సేతుపతి బుచ్చిబాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా.. ఉప్పెన సినిమా బుచ్చి బాబు కోసమే చేశానని, ఆయనకు సినిమా మీద ఉన్న ఫ్యాషన్ ను చూసి నేను ఒప్పుకున్నాను. అందుకోసం చాలా తక్కువ రెమ్యునరేషన్ కు తీసుకున్నాను అని చెప్పుకొచ్చారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ సేతుపతి, బుచ్చిబాబు వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి