iDreamPost

వీడియో వైరల్: తండ్రి కోరిక నెరవేర్చిన కుమార్తెలు.. ఐసీయూ వార్డులో పెళ్లి

  • Published Jun 17, 2024 | 5:04 PMUpdated Jun 17, 2024 | 5:04 PM

నిన్న జరిగిన ఫాదర్స్ డే సందర్భంగా ఒక్కొక్కరూ తమ తండ్రుల కోసం వివిధ రకాల బహుమతులు సర్ప్రైజ్ లు ఇస్తూ సంతోష పెట్టి ఉంటారు. కానీ, తాజాగా ఓ ఇద్దరూ అమ్మాయిలు మాత్రం ఫాదర్స్ డే సందర్భంగా.. ఐసీయూలో ఉన్న తండ్రి కోరికను నెరవేర్చేందుకు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిన్న జరిగిన ఫాదర్స్ డే సందర్భంగా ఒక్కొక్కరూ తమ తండ్రుల కోసం వివిధ రకాల బహుమతులు సర్ప్రైజ్ లు ఇస్తూ సంతోష పెట్టి ఉంటారు. కానీ, తాజాగా ఓ ఇద్దరూ అమ్మాయిలు మాత్రం ఫాదర్స్ డే సందర్భంగా.. ఐసీయూలో ఉన్న తండ్రి కోరికను నెరవేర్చేందుకు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Jun 17, 2024 | 5:04 PMUpdated Jun 17, 2024 | 5:04 PM
వీడియో వైరల్: తండ్రి కోరిక నెరవేర్చిన కుమార్తెలు.. ఐసీయూ వార్డులో పెళ్లి

ప్రపంచంలో తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమ కూడా చాలా గొప్పది, విలువ కట్టలేనిది. అందుకేనేమో ఈ సృష్టిలో తండ్రి ప్రేమకు సాటి ఎవరూ లేరు, రారు అంటారు. ఎందుకంటే.. పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా.. నేనున్నాంటూ ధైర్యం చెప్పి. ఒక రక్షణ బటుడిలా నిలబడే ఏకైక వ్యక్తి నాన్న. అంతేకాకుండా.. తాను కష్టాల్లో నలిగిపోయినా, తన పిల్లలకు మాత్రం ఆ కష్టన్ని తెలియకుండా.. సుకుమారంగా పెంచే వ్యక్తి నాన్న. మరి అలాంటి గొప్ప పాత్ర పోషిస్తున్న తండ్రుల కోసం నిన్న దేశమంతా ఫాదర్స్ డే అనే గొప్ప వేడుకను జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఫాదర్స్ డే రోజున తమ తండ్రుల కోసం ఒక్కరూ ఒక్క విధంగా బహుమతులు, సర్ప్రైజ్ లు ఇస్తూ.. సంతోష పెట్టిన వాళ్లనూ చూశాం. కానీ, తాజాగా ఓ ఇద్దరూ అమ్మాయిలు మాత్రం ఫాదర్స్ డే సందర్భంగా.. ఐసీయూలో ఉన్న తండ్రి కోరికను నెరవేర్చేందుకు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తన సర్వశ్వాన్ని త్యాగం చేస్తూ.. పిల్లల భవిష్యత్తుకు పునాదిగా మారిన తండ్రి గురించి ఆలోచించేవారు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉంటారు.ఇక వారి చివరి దశలో ఏ కోరికలు అయినా అది ఒక కోరికల మిగిలిపోవడమే తప్పా నేరవేర్చిన పిల్లలు చాలా తక్కువగా ఉంటారు.కానీ, తాజాగా ఓ ఇద్దరు అమ్మాయిలు మాత్రం తన తండ్రి చివరి కోరికను నేరవేర్చేందుకు ఆసుపత్రినే పెళ్లి పందిరిగా మార్చేశారు. ఇంతకు ఏం జరిగిందంటే.. ఫాదర్స్​ డే వేళ ఓ తండ్రి కోరిక తీర్చేందుకు ఇద్దరు కూతుళ్లు ఐసీయూలోనే తమ వివాహం చేసుకున్నారు. డాక్టర్ల అనుమతితో ఆ తండ్రి కోరికను తీర్చారు. ఈ సంఘటన ఉత్తర్​ ప్రదేశ్ లో జరిగింది. మోహన్‌లాల్‌గంజ్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల సయ్యద్ మహ్మద్ జునైద్ ఇక్బాల్ కొద్ది రోజుల క్రితం చాతిలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరాడు. ఇక ఆయన ఆరోగ్యం బాగా క్షిణించడంతో.. చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతూ లక్నో హాస్పిటల్‌లోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు.

కాగా, జునైద్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక వారికి పెళ్లి సంబంధాలు కూడా  కుదిరాయి. అలాగే వీరికి ఈనెల అనగా జూన్ 22న ముంబైలో వివాహం  జరుగాల్సి ఉండగా.. ఇంతలో తండ్రి జునైద్‌ ఆనారోగ్యనికి గురైయ్యి ఆసుపత్రి పాలయ్యాడు. ఇక పరిస్థితి పూర్తిగా విషమించడంతో..చివరి కోరికగా తన కూతుళ్ల వివాహం చూడాలని డాక్టర్లను ప్రాధేయపడ్డాడు. దీంతో ఆస్పత్రిలోనే పెళ్లి చేసేందుకు అంగీకరించారు వైద్యులు. ఐసీయూలోకి వరుడు, ఇద్దరు కుటుంబసభ్యులను, పెళ్లి జరిపించే మౌలాను మాత్రమే అనుమతిచ్చారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది సమక్షంలోనే ఇక్బాల్ ఎదుట ముస్లిం సంప్రదాయం ప్రకారం.. తన ఇద్దరు కూతుళ్లకు వివాహం వేడుకను నిర్వహించారు. తన కూతుళ్ల పెళ్లి చూసిన జునైద్ ఇక్బాల్ ఆనందంతో భావేద్వగానికి గురైయ్యాడు. మరి ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కోరికను తీర్చేందుకు ఐసీయూలోనే వివాహం చేసుకున్న ఈ సంఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి