• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » movies » Tv Channels Targetting Web Series

ఛానెళ్ల చూపు వెబ్ సిరీస్ వైపు

  • By idream media Published Date - 10:45 AM, Tue - 19 May 20 IST
ఛానెళ్ల చూపు వెబ్ సిరీస్ వైపు

లాక్ డౌన్ రూపంలో కరోనా తెచ్చిన ప్రకంపనలు అన్ని ఇన్ని కావు. సినిమా టీవీ అనే భేదం లేకుండా మొత్తం స్థంబించిపోయాయి. సీరియల్స్ షూటింగ్ జరిగే అవకాశం లేకపోవడంతో రేటింగ్స్ తో పాటు యాడ్స్ తగ్గిపోయి ఛానల్స్ లబోదిబోమంటున్నాయి. వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ప్రేక్షకులకు ఒకరకమైన విసుగు తెప్పించారనే చెప్పాలి. ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ మీద అవగాహన లేని కామన్ ఆడియెన్స్ వాటినే చూస్తూ రిపీట్ రన్స్ కు సైతం ఆదరణ కలిగిస్తున్నారు.

ఇక వీటి స్టాక్ కూడా క్రమంగా అయిపోతోంది. ప్రత్యాన్మయం కోసం ఇప్పుడు ఛానల్స్ వెబ్ సిరీస్ ని టెలికాస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. దీనికి జీ తెలుగు శ్రీకారం చుట్టింది. నిన్నటి నుంచి క్వీన్ ని రాత్రి 8 గంటల నుంచి ప్రసారం చేస్తోంది. టైటిల్ రోల్ రమ్యకృష్ణ కావడంతో జనంలో ఆసక్తి ఉంది. ఇది కొన్ని నెలల క్రితం ఎంఎక్స్ ప్లేయర్ యాప్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. వివిధ బాషలలో అనువదించారు కూడా. తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ లో రమ్యకృష్ణ టైటిల్ రోల్ చేశారు. రివ్యూలు రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. అయితే ఇది అందరికి రీచ్ అయ్యుండదనే ఉద్దేశంతో జీ కొత్త ఎత్తుగడతో దీన్ని మొదలుపెట్టింది. దీన్ని మిగలిన ఛానల్స్ కూడా అనుసరించే అవకాశం లేకపోలేదు.

అయితే తెలుగులో స్ట్రెయిట్ వెబ్ సిరీస్ లు చాలా తక్కువ. అవి కూడా జీలోనే ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా హింది, ఇంగ్లీష్ లో రూపొంది తెలుగు డబ్బింగ్ ద్వారా అందుబాటులో ఉన్నవి కనక ప్రసారం చేస్తే రెస్పాన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. పూర్తి స్థాయిలో షూటింగులు మొదలుపెట్టడానికి ఇంకో నెలా రెండు నెలలు పట్టేలా ఉండటంతో ఇతర ఛానల్స్ కూడా ఈ విధమైన ఆప్షన్స్ ని పరిశీలిస్తున్నాయి. ఒకవేళ వర్కౌట్ అయితే మరిన్ని వెబ్ సిరీస్ లు బుల్లితెరపై ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. పేర్లు వేరైనా సీరియల్స్, వెబ్ సిరీస్ స్వరూపం ఒకటే. కాకపోతే డిజిటల్ కంటెంట్ లో క్వాలిటీ తో పాటు కంటెంట్ కూడా స్టాండర్డ్ లో ఉంటుంది. స్టార్ మాకు ఎలాగూ హాట్ స్టార్ తో టై అప్ ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు పడినా ఆశ్చర్యం లేదు

Tags  

  • Corona
  • Digital Streaming
  • Lockdown
  • Queen
  • Ramyakrishna
  • Web Series
  • కరోనా
  • క్వీన్
  • డిజిటల్ ఎంటర్ టైన్మెంట్
  • లాక్ డౌన్
  • వెబ్ సిరీస్

Related News

సైలెంట్​గా OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ అందులోనే!

సైలెంట్​గా OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ అందులోనే!

కరోనా వల్ల ఓటీటీలకు ఆడియెన్స్ బాగా అడిక్ట్ అయిపోయారు. క్వాలిటీ కంటెంట్ అందుబాటులో ఉండటంతో ఓటీటీ సబ్​స్క్రిప్షన్ తీసుకునేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే గాక హాలీవుడ్​తో పాటు ఇతర విదేశీ భాషలకు చెందిన సినీ పరిశ్రమల నుంచి వచ్చే బెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్​లను కూడా స్ట్రీమింగ్​లోకి తీసుకొస్తున్నాయి ఓటీటీ సంస్థలు. దీంతో ఓటీటీ సబ్​స్క్రైబర్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. సినిమాలు బిగ్ స్క్రీన్స్​లో రిలీజవ్వడం ఎంత ముఖ్యమో […]

6 days ago
క్రికెట్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. ఆసీస్ సిరీస్ కూడా ఫ్రీగానే! ఎందులో అంటే..?

క్రికెట్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. ఆసీస్ సిరీస్ కూడా ఫ్రీగానే! ఎందులో అంటే..?

1 week ago
రిలీజై నెలలు గడుస్తున్నా.. ఇంకా ఓటిటిలోకి రాని సినిమాలు!

రిలీజై నెలలు గడుస్తున్నా.. ఇంకా ఓటిటిలోకి రాని సినిమాలు!

2 weeks ago
‘జైలర్’ బాక్సాఫీస్ ఊచకోత! ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

‘జైలర్’ బాక్సాఫీస్ ఊచకోత! ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

1 month ago
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ మూవీ రివ్యూ!

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ మూవీ రివ్యూ!

1 month ago

తాజా వార్తలు

  • 9 ఏళ్లు ఆయనతో ప్రేమలో ఉన్నా.. కానీ ఆ విషయం లగ్నపత్రికతోనే తెలిసింది!
    2 hours ago
  • రైతులకు అలర్ట్.. ఆ పని చేయకపోతే నష్టపోతారు!
    2 hours ago
  • సమంత గ్రేట్‌.. ఇలా నిజం ఒప్పుకునే ధైర్యం ఎవరికి ఉంది?
    2 hours ago
  • డాక్టర్‌ నిర్వాకం.. కడుపులో కత్తి వదిలేశాడు..
    3 hours ago
  • ఆస్కార్ రేసులో ‘బలగం’, ‘దసరా’.. ఆ సినిమాతోనే తెలుగు మూవీస్​కు పోటీ!
    3 hours ago
  • విద్యార్థితో గుంజీలు తీయించాడని.. టీచర్ పై పేరెంట్ దాడి.. వీడియో వైరల్
    3 hours ago
  • కూతురి మరణం.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ లేఖ!
    4 hours ago

సంఘటనలు వార్తలు

  • ‘సలార్’ గురించి ఇక మర్చిపోండి.. ప్రభాస్ మూవీ ఇప్పట్లో లేనట్లే!
    4 hours ago
  • గుడ్ న్యూస్ చెప్పిన TSRTC.. ప్రయాణికులకు బంపరాఫర్!
    4 hours ago
  • 7/G రీ రిలీజ్! 20 ఏళ్ళ తరువాత కూడా ఇంత క్రేజ్ కి కారణం?
    5 hours ago
  • వీడియో: చాయ్ కోసం వెళ్లిన పోలీసులు.. వ్యాన్ నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీలు
    5 hours ago
  • టీమిండియాలో అతడే నెక్స్ట్ కోహ్లీ.. వరల్డ్ కప్​లో దంచికొడతాడు: రైనా
    5 hours ago
  • ప్రజలపై రెచ్చిపోయిన సీఎం కుమారుడు.. డబ్బు పిచ్చి పట్టిందంటూ..
    5 hours ago
  • సూర్యపై మాకు నమ్మకం ఉంది! అతన్ని ఇంకా సపోర్ట్‌ ఇస్తాం: ద్రవిడ్‌
    5 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version