iDreamPost

శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ మరో గుడ్ న్యూస్

శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ మరో గుడ్ న్యూస్

శ్రీవారి భక్తుల భద్రతపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేక దృష్టి పెట్టింది. మొన్నటికి మొన్న మెట్ల మార్గంలో చిరుతల సంచారం ఎక్కువవడంతో అటు నుంచి వచ్చే భక్తులకు చేతి కర్రలు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా మెట్ల మార్గంలో కంచె ఏర్పాటుకు సైతం టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలోనే టీటీడీ శ్రీవారి భక్తులకు మరో శుభవార్తను అందించింది. అసలు విషయం ఏంటంటే? ఇటీవల చిరుతల సంచారం ఎక్కువవడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్ నుంచి వచ్చే ద్విచక్రవాహనాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే అనుమతినిచ్చిన విషయం విధితమే. అయితే తాజాగా ఘాట్ రోడ్ లో వచ్చే ద్విచక్రవాహనాలకు ఇకపై రాత్రి10 వరకు అనుమతులు కల్పించింది. ఈ విషయం తెలుసుకుని ద్విచక్ర వాహనంపై వచ్చే శ్రీవారి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి