iDreamPost

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవారి వస్త్రాలను సొంతం చేసుకునే అవకాశం!

TTD: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. స్వామి వారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తిరుపతికి వస్తుంటారు. ఇక తరచూ శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్తలు చెబుతుంది. అలానే తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ.

TTD: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. స్వామి వారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తిరుపతికి వస్తుంటారు. ఇక తరచూ శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్తలు చెబుతుంది. అలానే తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ.

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవారి వస్త్రాలను సొంతం చేసుకునే అవకాశం!

కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. పిల్ల పాపలతో తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి సేవలో తరింస్తారు. అలా నిత్యం కళ్యాణం పచ్చ తోరణం మాదిరిగా తిరుమల క్షేత్రం వెలిగిపోతూ ఉంటుంది. ఇదే సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అనేక చర్యలు తీసుకుంటుంది. అలానే శ్రీవారి దర్శనం, ఇతర విషయాలకు సంబంధించి.. భక్తులకు శుభవార్త చెబుతోంది. తాజాగా శ్రీవారి భక్తులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అది కూడా స్వామి వారి వస్త్రాలను సొంతం చేసుకునే అరుదైన అవకాశం లభించనుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

నిత్యం ఎంతో దూరం నుంచి వివిధ మార్గాలో లక్షలాది మంది తిరుమల శ్రీవెంకటేశ్వరుడిని దర్శనానికి వస్తుంటారు. అలానే తిరుమల కొండలు నిత్యం గోవింద నామ స్మరణంతో మారుమోగుతుంటాయి. ఏడు కొండలపై ఎటు చూసినా భక్త జన సందోహమే కనిపిస్తూ ఉంటుంది. ఎంతో దూరం నుంచి  ఎన్నో గంటల సమయం పాటు తిరుమలకు చేరుకుని, దర్శన సమయంలో స్వామి వారిని చూసిన క్షణం.. ఆ కష్టాలు మొత్తం మైమర్చిపోతారు. ఇక స్వామివారికి సంబంధించిన ఏ వస్తువును అయినా పొందేందుకు భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. స్వామి వారి క్యాలెండర్లు, పుస్తకాలు, తీర్దప్రసాదాలు వంటి అనేక శ్రీవారి వస్తువులను పొందేందుకు భక్తులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు.  ఈ నేపథ్యంలోనే తరచూ టీటీడీ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెబుతూ ఉంటుంది. తాజాగా తిరుమల శ్రీవారి భక్తులకు మరో శుభవార్త చెప్పింది టీటీడీ. శ్రీవారి వస్త్రాల ఈ- వేలానికి సంబంధించి కీలక సమాచారం వెల్లడించింది టీటీడీ.

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు వస్త్రాలను సమర్పింస్తుంటారు. అలా స్వామిరి వచ్చే వస్త్రాలను ఏప్రిల్ 15 నుంచి 23వ తేదీ వరకు ఈ వేలం వేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 335 లాట్లు ఉన్నాయని టీటీడీ పేర్కొంది. ఇక టీటీడీ వేలం వేయనున్న శ్రీవారి వస్త్రాల్లో ఆర్ట్ సిల్క్ ధోతీలు, ఉత్తరీయాలు,  ట‌వ‌ళ్లు, పంచెలు, శాలువ‌లు, నాప్ కిన్స్‌, హ్యాండ్ క‌ర్చీఫ్‌లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్స్‌, జంకాళాలు, కార్పెట్లు ఉన్నాయి. శ్రీవారికి భక్తులు సమర్పించిన ఈ కానుకలను ఈ నెల 15 నుంచి ఈ- వేలం వేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ వేలంకి సంబంధించి పూర్తి వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ ఆఫీస్ ను సంప్రదించాలని సూచించింది. టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org/ www.konugolu.ap.govt.in సంప్రదించగలరు అని పేర్కొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి