iDreamPost

శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే మీకు ఇష్టమా? మీ అందరికీ TTD శుభవార్త!

  • Published Apr 06, 2024 | 5:03 PMUpdated Apr 06, 2024 | 5:25 PM

నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారి దర్శనం కోసమే కాకుండా.. లడ్డూప్రసాదం కోసం కూడా కాంప్లెక్స్‌లో ఎంతో ఓపికగా వేచి చూడాల్సి ఉంటుంది. అసలే వేసవి, మరో వైపు భక్తులు పడుతున్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది శ్రీవారి భక్తులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పావచ్చు.

నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారి దర్శనం కోసమే కాకుండా.. లడ్డూప్రసాదం కోసం కూడా కాంప్లెక్స్‌లో ఎంతో ఓపికగా వేచి చూడాల్సి ఉంటుంది. అసలే వేసవి, మరో వైపు భక్తులు పడుతున్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది శ్రీవారి భక్తులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పావచ్చు.

  • Published Apr 06, 2024 | 5:03 PMUpdated Apr 06, 2024 | 5:25 PM
శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే మీకు ఇష్టమా? మీ అందరికీ TTD శుభవార్త!

దేశంలో అత్యంత ప్రాముఖ్యత గల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఏదంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పవచ్చు. పైగా ఈ తిరుమలను కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. ఎందుకంటే.. స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ పై వెలిసారు. అందుచేతనే అందరూ ఆయనను కలియుగ ప్రత్యేక్ష్య దైవంగా పిలుస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమలలో కొలువైన ఆ శ్రీనివాసుడుని దర్శించుకోనుటకు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఇలా దేశం నలుమూలాల నుంచి నిత్యం లక్షల సంఖ్యలో తిరుమల కొండకు తరలివెళ్తుంటారు. అలాగే ఎంతో ఓపికగా క్యూలైన్లలో శ్రీనివాసుని నామస్మరణం చేసుకుంటూ.. ఆయన దర్శనం భాగ్యం తరించుకుంటారు. ఇక కంపార్ట్‌మెంట్లో వేచి ఉండి శ్రీవారిని దర్శించుకునే భక్తులు.. ఆ తర్వాత లడ్డూప్రసాదం కోసం కూడా కాంప్లెక్స్‌లో ఎంతో ఓపికగా వేచి చూడాల్సి ఉంటుంది. అసలే తిరుమలలో భక్తుల రద్దీ, మరో వైపు భగ భగ మండే ఎండాల వలన అవస్థలు పడుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది శ్రీవారి భక్తులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పావచ్చు. ఇంతకు ఏమిటంటే..

కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆ శ్రీనివాసునికి ఎంత విశిష్టత ఉందో.. ఇక ఆయన లడ్డూ ప్రసాదంకు కూడా ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఇక తిరుమల వెళ్లిన వారు ఎవరైనా ఆ శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకువస్తే.. ఆ ప్రసాదం కళ్లకు హద్దుకొని మరి స్వీకరిస్తాం. ఇక తిరుమల వెళ్లలేని వారు కూడా ఆ స్వామి వారు ప్రసాదం స్వీకరించినప్పుడు.. సాక్షత్తు ఆయనను దర్శించుకునే అంతా పుణ్యంగా భావిస్తుంటారు.మరి, అలాంటి ఎంతో ప్రత్యేకమైన, విశిష్టత కలిగిన ప్రసాదం కోసం భక్తులు.. ఎంతో ఓపికగా క్యూ లైన్ లో నిల్చొని కొంటుంటారు. అయితే ఇప్పడు భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అసలే వేసవి కావడంతో తిరుమలలో రద్దీ దృష్ట్యా.. భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇటీవల డయల్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలోనే లడ్డూల విషయాన్ని ఓ భక్తుడు ఈవో ధర్మారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్‌లో ఎదురవుతున్న సమస్యను ఫోన్ కాల్ ద్వారా టీటీడీ ఈవో దృష్టికి రావడం జరిగింది. అయితే శ్రీవారి దర్శనం త్వరగానే పూర్తవుతున్నప్పటికీ.. లడ్డూప్రసాదం జారీలో ఆలస్యం అవుతోందని ఈవో గుర్తించారు. అయితే ఈ లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్‌లోని ఉద్యోగులకు షిప్టులవారీగా విధులు కేటాయిస్తూ ఉంటారు. ఈ క్రమంలో షిఫ్టుల మార్పుల కారణంగా లడ్డూల జారీలో ఆలస్యం అవుతోందని.. ఇక నుంచి త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే భక్తుడు ఫిర్యాదు మీద ఈవో ధర్మారెడ్డి స్పందించి.. 60 లడ్డూ కౌంటర్ల ద్వారా లడ్డూలు పంపిణీ చేస్తున్నట్లు భక్తుడికి వివరించారు. కాగా, వేసవిలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని.. అందుకు అనుగుణంగా మరో 15 కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. త్వరలో 75 కౌంటర్ల ద్వారా లడ్డూలను త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక అదనపు కౌంటర్ల ఏర్పాటు ద్వారా.. లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్‌లో క్యూలైన్లలో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చూస్తామని ఈవో ధర్మారెడ్డి అన్నారు. దీంతో పాటు ఈ వేసవిలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు. మరి, తిరుమల లడ్డూ ప్రసాదం పై టీటీడీ తీసుకున్న నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి