iDreamPost

TTDకి భారీగా పెరిగిన ఆదాయం.. ఎన్ని వందల కోట్లు అంటే!

TTD Income Increases: యుగ యుగాల నుంచి పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా.. కలియుగ వైకుంఠంగా బాసిల్లుతుంది తిరుమల తిరుపతి. ప్రతిరోజూ కోట్ల మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు తరలివస్తుంటారు.

TTD Income Increases: యుగ యుగాల నుంచి పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా.. కలియుగ వైకుంఠంగా బాసిల్లుతుంది తిరుమల తిరుపతి. ప్రతిరోజూ కోట్ల మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు తరలివస్తుంటారు.

TTDకి భారీగా పెరిగిన ఆదాయం.. ఎన్ని వందల కోట్లు అంటే!

ప్రతి నిత్యం లక్షల మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రాల్లో ఒకటి తిరుమల. కలియుగ వైకుంఠంగా దివ్య పుణ్యక్షేత్రంగా యుగ యుగాల నుంచి భాసిల్లుతున్న క్షేత్రం తిరుమల తిరుపతి. అందుకే ఈ క్షేత్రం ప్రపంచ ప్రఖ్యాత హైందవ పుణ్యక్షేంత్రంగా పిలుస్తారు. ఇంత గొప్ప పుణ్య స్థలంలో ఆవిర్భవించిన స్వామి శ్రీనివాసుడిని భక్తితో కొలిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అందుకే తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంది. అనంత పేర్లు కలిసిగి స్వామివారిని ఏ పేరుతో పిలిచినా పలికి వారి కోరికలు తీర్చే కోనేటి రాయుడి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమల ఖజానా భారీగా పెరిగిపోతుంది. తాజాగా టీటీడీ ఖజానాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

సమ్మర్ సీజన్ వచ్చిందంటే పుణ్య క్షేత్రాలు భక్తుల తో కిట కిటలాడుతాయి. ముఖ్యంగా తిరుమలేశుడిని దర్శించుకోవడానికి లక్షల మంది తిరుమలకు తరలివస్తుంటారు.   తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోవడంతో శ్రీవారి దర్శనానికి ఏకంగా 12 గంటల సమయం పడుతుంది. గత ఐదేళ్లలో రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం గణనీయంగా పెరిగిపోతూ వస్తుందని దేవస్థానం అధికారులు తెలిపారు. 2023-24 ఏడాదికి గాను రూ.1,161 కోట్లు కరెన్సీ, 1,031 కేజీల బంగారాన్ని టీటీడీ డిపాజిట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ మొత్తాన్ని టీటీడీ డిపాజిట్ చేయడంతో మొత్తంగా రూ.18 వేల కోట్లకు డిపాజిట్లు చేరుకున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఏటా లభించే వడ్డీ 1,200 కోట్లు దాటిపోయింది. 2018 నాటికి ప్రతి ఏటా లభించే వడ్డీ రూ.750 కోట్లు ఉండగా.. ఐదేళ్ల కాలంలో దాదాపు 500 కోట్లకు పెరిగిపోయింది. ప్రస్తుతం తిరుమలలో ఉచిత దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శనివారం దాదాపు 73,051 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 34,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక ఏప్రిల్ 20, శనివారం ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లుగా ఉన్నట్లు టీటీడీ అధికారలు తెలిపారు.ఇదిలా ఉంటే.. తిరుమలలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరుగుతాయని అధికారులు తెలిపారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి