iDreamPost

TTD కీలక నిర్ణయం.. ఇక అక్కడ కూడా అన్న ప్రసాదం ప్రారంభం..

  • Published Apr 18, 2024 | 10:34 AMUpdated Apr 18, 2024 | 10:34 AM

తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో ఇష్టంగా స్వీకరించే అన్న ప్రసాదానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో ఇష్టంగా స్వీకరించే అన్న ప్రసాదానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Apr 18, 2024 | 10:34 AMUpdated Apr 18, 2024 | 10:34 AM
TTD కీలక నిర్ణయం.. ఇక అక్కడ కూడా అన్న ప్రసాదం ప్రారంభం..

తిరుమల అనగానే.. ఏడుకొండల వాడు.. తిరుపతి లడ్డుతో పాటు.. అక్కడ పెట్టే అన్న ప్రసాదం కూడా అదే స్థాయిలో ఫేమస్ అయ్యాయి. తిరుపతి వెళ్లిన భక్తులు.. పేద, ధనిక తారతమ్యం లేకుండా ఇక్కడ ఉచితంగా పెట్టే అన్న ప్రసాదం స్వీకరిస్తారు. ఎంతటి ధనవంతులైన సరే.. ఈ అన్న ప్రసాదాన్ని కళ్లకు అద్దుకుని తింటారు. రోజుకు వేలమంది టీటీడీ అందించే ఉచిత భోజనాన్ని స్వీకరించి తరిస్తారు. ఇక తిరుమలలో మాత్రమే లభించే అన్న ప్రసాదాన్ని ఇక మీదట మరో చోట కూడా ప్రారంభించింది టీటీడీ. ఇంతకు ఎక్కడ అంటే..

తిరుమలలో భక్తులకు పెట్టే అన్నప్రసాదానికి సంబంధించి తాజాగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కూడా అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల కోసం తరలి వచ్చే వేలాది మంది భక్తులకు నిరంతరాయంగా రుచిక‌ర‌మైన‌ అన్నప్రసాదాలను అందిస్తోంది టీటీడీ. స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, మ‌జ్జిగ అందిస్తున్నారు టీటీడీ సిబ్బంది.

TTD is a key decision

కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులు ఎండల వల్ల ఇబ్బంది పడకుండా చూడటం కోసం జ‌ర్మ‌న్ షెడ్లు, కూల‌ర్లు ఏర్పాటు చేశారు. ఇక ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ప్ర‌తి రోజు ఉద‌యం 7 గంట‌ల‌కు అల్పాహారం, ఉద‌యం 10.30 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు మ‌ర‌ల సాయంత్రం 6.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు రుచిక‌ర‌మైన అన్నం, సాంబారు, ర‌సం, మ‌జ్జిగ‌, ప‌చ్చ‌డి, క‌ర్రీ, బెల్లం పొంగ‌లి అందిస్తారు. ఇందుకోసం దాదాపు 50 మంది టీటీడీ అన్న‌ప్ర‌సాదం విభాగం సిబ్బంది ప‌నిచేస్తున్నారు.

ఒంటిమిట్ట‌ బ్రహ్మోత్సవాలు..

క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆల‌యంలో ఏప్రిల్ 17-25వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందు కోసం ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 7.30 నుంచి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న సేవ‌లు జ‌రుగుతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి