iDreamPost

లక్షిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందించిన TTD

లక్షిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందించిన TTD

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తల్లిదండ్రులతో వెళుతూ లక్షిత నే బాలిక చిరుత దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన లక్షిత తన తల్లిదండ్రులు దినేష్‌, శశికళతో కలిసి తిరుమల బయలుదేరింది. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఓ చిరుత పులి లక్షిత దాడి చేసి, చంపేసింది. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కలకలం రేపింది. ఇక, బాలిక మృతికి సంబంధించి టీటీడీ, ఏపీ అటవీశాఖలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాయి.

తాజాగా, ఈ ఎక్స్‌గ్రేషియా డబ్బుల్ని కుటుంబానికి అందజేశాయి. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఇందులో టీటీడీకి సంబంధించినవి 5 లక్షల రూపాయలు ఉండగా.. ఏపీ అటవీ శాఖకి సంబంధించినవి మరో 5 లక్షల రూపాయలు ఉన్నాయి. కాగా, లక్షిత మరణంపై మొదట్లో సందిగ్ధత నెలకొని ఉండింది. బాలికను చంపింది చిరుత అని కొందరు.. ఎలుగుబంటి అని మరికొందరు ఇలా వార్తలు వచ్చాయి. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో చిరుత కారణంగానే బాలిక చనిపోయినట్లు తేలింది.

ఎస్వీ మెడికల్‌ కాలేజీ ఫోరెన్సిక్‌ విభాగం బాలిక చావుకు చిరుతే కారణమని స్పష్టం చేసింది. బాలికను చంపిన తర్వాత చిరుత కొంత భాగాన్ని తిని వెళ్లిపోయిందని తెలిపింది. ఆ తర్వాత వేరే జంతువు ఏదైనా బాలిక మృతదేహాన్ని తిని ఉండొచ్చని అభిప్రాయపడింది. లక్షిత కుటుంబానికి మరో 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరి, లక్షిత కుటుంబానికి టీటీడీ, ఏపీ అటవీశాఖలు ఎక్స్‌గ్రేషియా అందించటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి