iDreamPost

తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త.. ఇది కచ్చితంగా తెలుసుకోవాలి!

Good News For Tirumala Devotees: తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఆ ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే..

Good News For Tirumala Devotees: తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఆ ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే..

తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త.. ఇది కచ్చితంగా తెలుసుకోవాలి!

కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు  దేశం నలుమూల నుంచి భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా సమ్మర్ లో తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక బస్సులు, రైళ్లు కిక్కిరిసి తిరుమలవైపు వెళ్తుంటాయి. విద్యార్థులకు పరీక్షలు అయిపోయి, సెలవులు ప్రకటించడంతో తిరుమల్లో రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సైతం బస్సుల సంఖ్యను పెంచుతుంది. ఇదే నేపథ్యంలో తిరుమలక భక్తులకు రైల్వేశాఖ కూడా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక రైళ్లలను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

తిరుమలలో వెలసిన  శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆసక్తి ఉంటారు. అలానే వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. ఇదే సమయంలో తిరుమలకు ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుమలకు వెళ్లే భక్తులకు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ నుంచి తిరుపతి మధ్య రెండు ప్రత్యేక  ట్రైన్లను (07653/07654) నడపనున్నట్లు కడప రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు కడప మీద నుంచి తిరుపతి, కాచిగూడ మధ్య నడుస్తాయని తెలిపారు.

ఏప్రిల్‌ 11, 18, 25, మే 1వ తేదీల్లో కాచిగూడ నుంచి తిరుపతికి ఈ ప్రత్యేక రైలు నడవనుంది. కాచిగూడలో గురువారం రాత్రి 10.30 గంటలకు బయలుదేరి ఎర్రగుంట్లకు శుక్రవారం ఉదయం 6.30 గంటలకు, కడపకు 7.05 గంటలకు  చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరుపతికి శుక్రవారం ఉదయం 10.10 గంటలకు వెళ్లనుంది. ఇక ఇదే ప్రత్యేక రైళ్లు తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 12, 19, 26 మే 2వ తేదీల్లో ప్రతి శుక్రవారం తిరుపతిలో రాత్రి 8.05 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 10.25 గంటలకు కడపకు, 11.05 గంటలకు ఎర్రగుంట్లకు చేరుకునుంది. అక్కడి నుంచి మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు కాచిగూడకు వెళ్తోంది. రైలు ప్రయాణికులకు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు కోరారు.

అదే విధంగా  ఇప్పటికే తిరుపతి,  షోలాపూర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు గడువును పెంచారు. జూన్ 28వ తేదీ వరకు తిరుపతి-షోలాపూర్ మధ్య నడిచే ట్రైన్  పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. షోలాపూర్‌ (01437) నుంచి తిరుపతికి వెళ్లే రైలు ప్రతి గురువారం రాత్రి 9.00 గంటలకు షోలాపూర్‌లో బయలు దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 4.55 గంటలకు కడపకు, 7.45 గంటలకు తిరుపతికి చేరుతుందన్నారు. అదే విధంగా తిరుపతి, షోలాపూర్ 01438 రైలు ప్రతి శుక్రవారం రాత్రి 9.10 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి కడపకు 11.10 గంటలకు చేరుకుంటుంది. అలానే మరుసటి రోజు సాయంత్రం 7.10 గంటలకు షోలాపూర్‌ చేరుతుందని అధికారులు తెలిపారు. ఇక ఈ స్పెషల్ ట్రైన్ లాతూరు, కమలపూర్‌, వాడి, యాదిగిరి, రాయచూర్‌, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, రాజంపేట స్టేషన్లలో ఆగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణీకులు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి