iDreamPost
android-app
ios-app

Hardik Pandya: ఢిల్లీ బ్యాటర్ల విధ్వంసం.. పాపం పాండ్యాకు మైండ్ దొబ్బినట్లుంది! వీడియో వైరల్

  • Published Apr 27, 2024 | 5:59 PM Updated Updated Apr 27, 2024 | 5:59 PM

ఢిల్లీ బ్యాటర్ల వీరబాదుడుకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మైండ్ దొబ్బినట్లుంది. దాంతో తమ బౌలర్లపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇంతకు ముందెన్నడూ పాండ్యాను ఇంత కోపంగా చూసుండరు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఢిల్లీ బ్యాటర్ల వీరబాదుడుకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మైండ్ దొబ్బినట్లుంది. దాంతో తమ బౌలర్లపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇంతకు ముందెన్నడూ పాండ్యాను ఇంత కోపంగా చూసుండరు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Hardik Pandya: ఢిల్లీ బ్యాటర్ల విధ్వంసం.. పాపం పాండ్యాకు మైండ్ దొబ్బినట్లుంది! వీడియో వైరల్

ఐపీఎల్ 2024లో పరుగుల వరదపారిస్తున్నారు ప్లేయర్లు. ఒకరిని మించి మరోకరు ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడుతుండటంతో.. వారికి ఏం చేయాలో తోచట్లేదు. దాంతో ప్రేక్షకపాత్ర వహిస్తూ.. వారితో కలిసి మ్యాచ్ ను చూస్తున్నారు. నిన్న పంజాబ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో రికార్డ్ ఛేజింగ్ స్కోర్ నమోదైన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్ లో సైతం భారీ స్కోర్ నమోదైంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. అయితే ఢిల్లీ బ్యాటర్లు సృష్టిస్తున్న విధ్వంసం చూసి.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మైండ్ దొబ్బినట్లుంది. MI బౌలర్లపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ముంబైతో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్ 257 పరుగులు చేసింది. వచ్చిన ప్లేయర్లు వచ్చినట్లే ముంబై బౌలర్లను చితకబాదారు. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు జేక్ ఫ్రేజర్ ఎంఐ బౌలర్లను చీల్చి చెండాడాడు. కేవలం 27 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. అతడు ఔటైయ్యాడు కాబట్టి ప్రత్యర్థి బౌలర్లు బతికిపోయారు. లేదంటే? భారీ సెంచరీతో బాక్సులు బద్దలు చేసేవాడే. ఇక ఈ మ్యాచ్ లో అతడి విధ్వంసం ధాటిని తట్టుకోలేకపోయాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా. పైగా పాండ్యా ఓవర్లో చితక్కొట్టాడు ఫ్రేజర్. ఆ ఓవర్లో 2 సిక్సులు, 2 ఫోర్లతో 20 పరుగులు పిండుకున్నాడు.

కాగా.. ఫ్రేజర్ బ్యాటింగ్ చూసి పాండ్యాకు మైండ్ దొబ్బినట్లుగా ప్రవర్తించాడు. అతడు సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతుంటే.. ముంబై బౌలర్లపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు పాండ్యా. ఇంతకు ముందెన్నడూ ఈ రేంజ్ లో కోపాన్ని ప్రదర్శించలేదు హార్దిక్. ఢిల్లీ బ్యాటర్లు దంచికొడుతుండటంతో.. సహనం కోల్పోయిన ముంబై కెప్టెన్ గట్టిగా అరుస్తూ తన కోపాన్ని ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పాపం ఫ్రేజర్ కొట్టుడుకు పాండ్యాకు మైండ్ దొబ్బినట్లుంది అంటూ రాసుకొస్తున్నారు. మరి ముంబై బౌలర్లపై పాండ్యా ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis girişesrar satın al