iDreamPost

నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉన్న బెస్ట్ కొరియన్ సిరీస్ ఇవే !

  • Published Apr 10, 2024 | 12:16 PMUpdated Apr 10, 2024 | 12:16 PM

Netflix korean WebSeries: ఓటీటీలో వరుస సినిమాల సందడి ప్రేక్షకులను నిత్యం ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా ఇష్టపడుతున్నవి మాత్రం కొరియన్ సిరీస్. మరి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ కొరియన్ సిరీస్ ఏంటో చూసేద్దాం.

Netflix korean WebSeries: ఓటీటీలో వరుస సినిమాల సందడి ప్రేక్షకులను నిత్యం ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా ఇష్టపడుతున్నవి మాత్రం కొరియన్ సిరీస్. మరి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ కొరియన్ సిరీస్ ఏంటో చూసేద్దాం.

  • Published Apr 10, 2024 | 12:16 PMUpdated Apr 10, 2024 | 12:16 PM
నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉన్న బెస్ట్ కొరియన్ సిరీస్ ఇవే !

నిత్యం ఓటీటీలలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు ఒక ఎత్తైతే.. కొరియన్ సినిమాలు ఒక ఎత్తని చెప్పి తీరాలి. ఎంటర్టైన్మెంట్ ప్లాట్ ఫార్మ్స్ లో భాషతో సంబంధం లేకుండా నిత్యం ఎన్నో రకాల వెబ్ సిరీస్ లు, సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కొరియన్ సిరీస్ లు సినిమాలు ఎప్పుడు వచ్చాయో తెలియదు కానీ.. ఇప్ప్పుడు మాత్రం కొరియన్ సిరీస్ కు పెరుగుతున్న క్రేజ్ అంత ఇంత కాదు. ముఖ్యంగా అమ్మాయిలు కొరియన్ సిరీస్ అంటే ప్రాణం పెట్టేస్తున్నారు. అంతలా యూత్ ను అట్ట్రాక్ట్ చేస్తున్నాయి ఈ కొరియన్ సిరీస్. దీనితో అసలు వాటిలో ఏముందా ఎలా ఉంటాయా అని తెలుసుకోవాలనే ఆసక్తి కొంతమందికి కలుగుతుంది. మరి అన్ని సిరీస్ లు ఉండగా వాటిలో ఏది చూడాలి అనే సందేహం వస్తే కనుక.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయ్యే హారర్, కామెడీ, డ్రామా, సస్పెన్స్, థ్రిల్లర్, రొమాన్స్ లాంటి బెస్ట్ కొరియన్ సిరీస్ వివరాలు ఇలా ఉన్నాయి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయ్యే బెస్ట్ కొరియన్ సిరీస్ వివరాలు ఇలా ఉన్నాయి.

1) స్క్విడ్ గేమ్ – సీజన్ 1:
ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ గురించి యూత్ కు బాగా తెలిసి ఉంటుంది. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్. ఇండియా వారు ఇప్పటివరకు చూడని సరికొత్త రీతిలో ఈ స్క్విడ్ గేమ్ సిరీస్ ను రూపొందించారు మేకర్స్. దీనితో ఈ సిరీస్ చేసిని ప్రతి ఒక్కరిని ఇట్టే కట్టిపడేస్తుంది. మొత్తంగా 94 దేశాల్లో నెట్ ఫ్లిక్స్ లో టాప్ సిరీస్ గా నిలిచింది ఈ సిరీస్. ఈ షో స్టోరీ లైన్ విషయానికొస్తే.. భారీ ప్రైజ్ మనీ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన కొందరు కంటెస్టెంట్స్ చుట్టూ తిరిగే కథ ఇది. ఈ ఏడాది మరొక సీజన్ కూడా రాబోతుంది.

2) మై నేమ్ – సీజన్ 1:
మై నేమ్ సిరీస్ పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఫుల్ మీల్స్ వడ్డించే సిరీస్. క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా అన్ని కలగలిపిన సిరీస్ ఇది. 2021లో మై నేమ్ మొదటి సీజన్ వచ్చింది. ఈ సిరీస్ స్టోరీ లైన్ విషయానికొస్తే.. గ్యాంగ్ స్టార్ అయిన తన తండ్రి మరణానికి.. రివెంజ్ తీర్చుకునే ఒక కూతురి కథ ఇది.

3) సిగ్నల్ – సీజన్ 1:
ఈ సిరీస్ కూడా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ అన్నిటిని కలగలిపిన సిరీస్ ఏ. ఈ సిరీస్ 2016 లో వచ్చింది. సిగ్నల్ సిరీస్ స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఇప్పటివరకు చూసిన క్రైమ్ స్టోరీస్ అన్నిటికంటే కూడా ఇది కాస్త సరికొత్తగా ఉంటుంది. క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికీ 2015లో ఒక వాకీ టాకీ దొరుకుతుంది. దానితో అతను గతంలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడతాడు, అలా 1989లో ఉన్న ఒక పోలీస్ డిటెక్టివ్ తో మాట్లాడి ఒక కేస్ ను సాల్వ్ చేస్తాడు. అసలు సాధ్యమేనా ! ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

4) కింగ్‌డమ్ – 2 సీజన్లు:
కింగ్‌డమ్ సిరీస్ 2020లో ప్రారంభమైన ఒక హర్రర్ సిరీస్. అయితే సిరీస్ లో మాత్రం ఇది 16వ శతాబ్దంలో జరిగినట్లుగా చూపించారు. ఈ సిరీస్ స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఒక రాజు, యువరాజు మధ్య ఈ కథ కొనసాగుతూ ఉంటుంది. ఒక వింత వ్యాధి బారిన పడిన తన తండ్రికి అసలు ఎం జరిగింది.. దానిని యువరాజు ఎలా పరిష్కరించాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

5) ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ – సీజన్ 1:
ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ ఈ సిరీస్ టైటిల్ చూస్తుంటేనే చెప్పేయొచ్చు ఇది ఒక హర్రర్ జోనర్ కు సంబంధించిన సిరీస్ అని. ఈ సిరీస్ స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఒక హై స్కూల్ లో చిక్కుకుపోయిన కొంతమంది టీనేజేర్స్.. వారు డేంజర్ జోన్ లో ఉన్నట్లు గుర్తిస్తారు. అక్కడ నుంచి వారు ఎలా బయటపడ్డారు అనేది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

మరి ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ అయ్యి ఉంటె కనుక.. వెంటనే చూసేయండి. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కొరియన్ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి