iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ కన్నుమూత.. నిర్మాత ఎమోషనల్!

  • Author singhj Updated - 08:14 PM, Sat - 19 August 23
  • Author singhj Updated - 08:14 PM, Sat - 19 August 23
టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ కన్నుమూత.. నిర్మాత ఎమోషనల్!

సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల కాలంలో మరణించి విషాదాన్ని నింపారు. తమ అద్వితీయ ప్రతిభతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సెలబ్రిటీలు తిరిగిరాని లోకాలకు పోవడం బాధాకరమనే చెప్పాలి. తమకు ఇష్టమైన నటులు, దర్శక నిర్మాతల మరణవార్తను విని వారి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. చాన్నాళ్ల వరకు ఆ బాధలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. సెలబ్రిటీలు అభిమానుల మీద చూపించే ప్రభావం అలాంటిదని చెప్పొచ్చు. ఇకపోతే, టాలీవుడ్​లో మరో విషాదం చోటుచేసుకుంది.

ప్రముఖ తెలుగు డిస్ట్రిబ్యూటర్ వినోద్ రెడ్డి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు, నిర్మాత అహితేజ బెల్లంకొండ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మిత్రుడు వినోద్ రెడ్డి మరణం గురించి చెబుతూ అహితేజ ఎమోషనల్ అయ్యారు. ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్ అయిన వినోద్ క్యాన్సర్​తో కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. సుమారుగా 25 సినిమాలకు పైగానే ఆయన డిస్ట్రిబ్యూట్ చేసినట్లుగా సమాచారం. బ్లాక్​బస్టర్ మూవీ ‘ఆర్ఎక్స్ 100’తో పాటు ‘నా పేరు సూర్య’ లాంటి పలు పాపులర్ సినిమాలను ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారని తెలిసింది.

డిస్ట్రిబ్యూటర్ వినోద్ రెడ్డి మృతి గురించి ప్రముఖ నిర్మాత అహితేజ్ ట్విట్టర్​లో ఒక పోస్ట్ పెట్టారు. తన స్నేహితుడు చనిపోయాడని ఆయన చెప్పుకొచ్చారు. వీబీఎం ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ వినోద్ రెడ్డి ఇక లేరంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇది తనకు చాలా షాకింగ్​గా అనిపిస్తోందన్నారు అహితేజ్. వినోద్ ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థించారు. కాగా, స్టార్ హీరో మంచు విష్ణుతో పాటు లగడపాటి శ్రీధర్ నిర్మించిన పలు సినిమాలను కూడా వినోద్ రెడ్డే డిస్ట్రిబ్యూట్ చేశారని తెలుస్తోంది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş