iDreamPost

ఈ గ్రూప్ పిక్‌లోని ముందు వరుసలో.. ఇప్పటి ఓ స్టార్ హీరోయిన్ ఉంది!

ఎవ్వరికైనా అందమైనది బాల్య దశ. ఈ దశలో సాగే సరదాలు, ఆనందాలు ఎప్పటికీ మధుర స్మృతులే. సామాన్యులకైనా, సెలబ్రిటీలైనా. అలాంటిదో ఈ ఫోటో కూడా. ఇది ఓ ప్రముఖ హీరోయిన్ స్కూల్ డేస్ గ్రూప్ పిక్ ఇది. ఎవరో కనిపెట్టండి చూద్దాం

ఎవ్వరికైనా అందమైనది బాల్య దశ. ఈ దశలో సాగే సరదాలు, ఆనందాలు ఎప్పటికీ మధుర స్మృతులే. సామాన్యులకైనా, సెలబ్రిటీలైనా. అలాంటిదో ఈ ఫోటో కూడా. ఇది ఓ ప్రముఖ హీరోయిన్ స్కూల్ డేస్ గ్రూప్ పిక్ ఇది. ఎవరో కనిపెట్టండి చూద్దాం

ఈ గ్రూప్ పిక్‌లోని ముందు వరుసలో.. ఇప్పటి ఓ స్టార్ హీరోయిన్ ఉంది!

ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత మధురమైన దశ బాల్యం. ఏమీ ఎరుగని ఆ వయస్సులో చేసిన చిలిపి పనులు, సరదాలు, సంతోషాలు.. ఎంతో మందికి తీపి జ్ఞాపకాలగా మిగిలిపోతుంటాయి. స్కూల్లో బెంచ్‌లో ప్లేస్ గురించి స్నేహితులతో గొడవ పడటం, మార్కులు తక్కువ వస్తే తండ్రికి ప్రోగ్రెస్ కార్డు చూపించకుండా.. తల్లితో సంతకం చేయడం, క్లాసులు ఎగ్గొట్టి అలా స్నేహితులతో బయటపడటం, చుట్టాలు, బంధువుల కళ్లల్లో పడి పేరెంట్స్ చేతిలో చావు దెబ్బలు తినడం, క్లాస్ మారుతున్నప్పుడల్లా కొత్త దుస్తులు, పెన్సిల్స్, పెన్నులు కొత్తవి వస్తుంటే కలిగే ఆనందం.. అబ్బో ఇలా చెప్పుకుంటే పోతే చైల్డ్ హుడ్‌ డేస్ ది బెస్ట్ డేస్ అనిపించకమానదు. మనమే కాదు సెలబ్రిటీలు కూడా ఇదే ఫేజ్ నుండి వచ్చిన వారే కదా.

వారికి కొన్ని మెమరీస్ ఉంటాయి. అలాంటి ఫోటోనే ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇదిగో ఈ స్కూల్ ఫోటో కూడా ఓ బ్యూటీఫుల్ హీరోయిన్ చిన్ననాటిది. ఇందులో మొదటి వరుసలో లెఫ్ట్ నుండి నాల్గవ అమ్మాయి.. టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్. హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీతో కెరీర్ స్టార్ చేసినా ఈ ముద్దుగుమ్మ..రాజమౌళి మూవీతో ఒక్కసారిగా స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది. ఈ భామ పెళ్లి చేసుకుంటే.. తమ గార్ల్ ఫ్రెండ్ మరెవర్నే చేసుకుందని ఏడ్చినంత పని చేశారు యూత్. ఇంతకు అంతలా యూత్‌ను కట్టిపడేసిన బ్యూటీ ఎవరంటే కాజు పాప అలియాస్ కాజల్ అగర్వాల్. ముంబయిలో సెయింట్ అన్నే హైస్కూల్లో చదువుకుంది కాజల్. అప్పటిదే ఈ గ్రూప్ ఫోటో.

లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కాజల్.. చందమామ మూవీతో టాలీవుడ్ చందమామగా మారిపోయింది. పౌరుడు, ఆటాడిస్తా సినిమాలు అలరించకపోయినా.. రాజమౌళి మగధీరతో ఒక్కసారిగా ఆమె ఫేట్ మారిపోయింది. ఇక తెలుగులో వరుస సినిమాలో బిజీ అయిపోయింది. గణేష్, ఆర్య 2, ఓం శాంతి, డార్లింగ్, బృందావనం, మిస్టర్ ఫర్ ఫెక్ట్, వీర, బిజినెస్ మ్యాన్, సారొచ్చారు, నాయక్, బాద్ షా, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, టెంపర్, సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, నేనే రాజు నేనే మంత్రి, ఆ, సీతా, రణరంగం, మోసగాళ్లు, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో అలరించింది. ఇప్పుడు సత్యభామగా కనువిందు చేసేందుకు సిద్ధమైంది. ఈ సారి మరింత పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. మే 31న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇవే కాకుండా తమిళ్, హిందీ చిత్రాల్లో నటించింది. ఆమె చేతిలో ఇండియన్ 2, ఉమా చిత్రాలున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి