iDreamPost
android-app
ios-app

విహారయాత్రలో తీవ్ర విషాదం!

  • Published Sep 12, 2023 | 9:07 AM Updated Updated Sep 12, 2023 | 9:07 AM
విహారయాత్రలో తీవ్ర విషాదం!

ఈ మద్య కాలంలో దేశంలో ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదల్లో ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అనుభవం లేకున్నా డ్రైవింగ్ చేయడం లాంటివి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని అధికారులు అంటున్నారు. కొన్నిసార్లు వాహనాలు రన్నింగ్ లో ఉన్నసమయంలో టైర్ పేలిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే..

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ కుప్పం సరిహద్దు ప్రాంతంలో తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మినీ ట్రావెల్స్ బస్సుకు పంక్చర్ అయ్యింది.. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు రోడ్డు పక్కన కూర్చున్నారు. అంతలోనే ఓ లారీ మినీ బస్ ని ఢీ కొట్టడంతో కూర్చున్న ప్రయాణికులపై పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడిక్కడే చనిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. 14 మంది తీవ్రంగా గాయపడటంతో క్షతగాత్రులను తిరుపత్తూరు, క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రులకు పోలీసులు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వేలూరు జిల్లాకు చెందిన 24 మంది ఈ నెల 8న కర్ణాటక టూర్ కోసం వెళ్లి తిరిగి తమ ఊరికి వస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కాగా, మృతులు ఎం. మీనా, డి.వేదయాని, ఎస్. దేవిక, కె.కళావతి, ఆర్.గీత, వి. సావిత్రి, పి.సైత్తు లుగా గుర్తించారు పోలీసులు. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్, క్లీనర్ తో పాటు పదిమందిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.