iDreamPost

భార్యాభర్తలు సాప్ట్ వేర్ ఉద్యోగులు.. మంచి లైఫ్.. కానీ!

  • Published Mar 19, 2024 | 10:16 AMUpdated Mar 19, 2024 | 12:37 PM

మంచి దాంపత్య జీవితం, భార్య భర్తలు ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు. కాగా, ఇద్దరి పిల్లలతో మంచి లైఫ్ ను సాగిస్తున్నారు. కానీ, ఇంతలోనే వారి కుటుంబం పై విధి చిన్న చూపు చూసింది.

మంచి దాంపత్య జీవితం, భార్య భర్తలు ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు. కాగా, ఇద్దరి పిల్లలతో మంచి లైఫ్ ను సాగిస్తున్నారు. కానీ, ఇంతలోనే వారి కుటుంబం పై విధి చిన్న చూపు చూసింది.

  • Published Mar 19, 2024 | 10:16 AMUpdated Mar 19, 2024 | 12:37 PM
భార్యాభర్తలు సాప్ట్ వేర్ ఉద్యోగులు.. మంచి లైఫ్.. కానీ!

ఇటీవల కాలంలో  సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లా మరణాలు రోజు రోజుకి ఎక్కువైపుతున్నాయి. వీటిలో కొన్ని అనుమానస్పదంగా మరణిచడం, ఆత్మహత్య చేసుకోవడం వంటి ఘటనలు కొన్ని అయితే.. మరి కొందరు మాత్రం రోడ్డు ప్రమాదంలో దుర్మరణ పాలవుతున్నారు. కాగా,ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదానికి గురయిన ఘటనలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.అయితే ఇలా తరుచు ప్రమాదాలకు గురవ్వడానికి అతి వేగమే కారణమవుతుంది. ఈ క్రమంలో కారు, బైక్ నియంత్రణ కోల్పోడం, అదుపు తప్పి వేరే వావాహనానికి ఢీ కొట్టడం జరుగుతుంది. కాగా, ఈ ఘోర రోడ్డు ప్రమాదాలు వలన అనేక కుటుంబాలు తీవ్ర శోక సంధ్రంలో మునిగిపోతున్నాయి. తాజాగా మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఘెర రోడ్డు ప్రమాదానికి గురైయింది. దీంతో ఆమె ప్రయాణిస్తున్న వాహహనం రెండు ముక్కలైంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కారులో ప్రయాణిస్తుండగా.. డివైడర్ ను ఢీకొన్న ఘటనలో అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో పోలీసులు తెలిపిన కథన మేరకు.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన మురళి, ఉమాదేవి(34) దంపతులు బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. కాగా, బెంగళూరులోని స్థిరపడిన వీరు.. తమ ఇద్దరు పిల్లలతో కలిసి మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని బంధువుల ఇంట జరిగిన ఓ శుభకార్యనికి హాజరయ్యారు. అయితే, ఆదివారం రాత్రి కారులో బెంగళూరుకు బయలుదేరారు. కానీ, సోమవారం ఉదయం పెనుకొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గుట్టూరు వై.జంక్షన్ వద్దకు చేరుకోగానే.. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోడంతో కారు వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొని రెండు ముక్కలైంది.ఇక ఈ ఘటనలో ఉమాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. కానీ, ఆ కారులో ఉన్న మిగిలిన ముగ్గురు స్వల్ప గాయాలుతో బయటపడ్డారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు పెనుకొండ ఎస్ఐ రంగడు తెలిపారు. ఇక శుభకార్యనికి వెళ్లి తిరిగి ఇంటిక వెళ్తున్న క్రమంలో ఉమాదేవి ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పై ఆమె కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించారు. మరి, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి