iDreamPost

బ్రేకింగ్: మరో ఘోర ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ!

West Bengal Train Accident: సాంకేతిక లోపం, కొందరి ఉద్యోగుల నిర్లక్ష్యం, ఇతర కారణాలతో  రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నెలల క్రితం ఒరిస్సా లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైళు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

West Bengal Train Accident: సాంకేతిక లోపం, కొందరి ఉద్యోగుల నిర్లక్ష్యం, ఇతర కారణాలతో  రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నెలల క్రితం ఒరిస్సా లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైళు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

బ్రేకింగ్: మరో ఘోర ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అనేక రకాల ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.  ముఖ్యంగా తరచూ జరగుతున్న రైలు ప్రమాదాలు అందరిని కలవరపెడుతున్నాయి. తరచూ ఏదో ఒక చోట రైళ్లకు సంబంధిచన ఇష్యూలు వార్తల్లో కనిపిస్తుంటాయి. సాంకేతిక లోపం, కొందరి ఉద్యోగుల నిర్లక్ష్యం, ఇతర కారణాలతో  రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నెలల క్రితం ఒరిసాలో జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైళు ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ తరువాత కూడా పలు చిన్న చిన్న రైళు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనలను మరుక ముందే తాజాగా పశ్చిమ బెంగాల్ లో ఘోర రై లు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీ కొనడంతో  పెను ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని డార్జిలింగ్‌లో ప్రాంతంలో సోమవారం  ఈ  ఘోర రైలు ప్రమాదం జరిగింది. రంగపాణి స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును  వెనుక నుంచి గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన చివర ఉండే  మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది మరణించినట్లు సమాచారం. అలానే 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని తెలుస్తోంది. సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇక ప్రమాద తీవ్రతకు బోగీలు చెల్లాచెదరుగా పడిపోయి.

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సీల్దా‌కు వెళ్తుండగా.. న్యూ జల్‌పాయ్‌గురి, రంగపాణి రైల్వే స్టేషన్ల మధ్య.. వెనుక నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇక సీల్దా ఈస్టర్న్ రైల్వే అధికారులు హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదం గురించి స్థానికులు సమాచారం ఇవ్వడంతో  వెంటనే రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలకు దిగింది.

ఈ  ఘటనపై సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అధికారులు బాధితులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.అలానే ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఎలా వచ్చాయి అనే విషయంపై అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ వెళ్లిన మార్గంలోనే వచ్చిన గూడ్స్ రైలు.. సిగ్నల్‌ను పట్టించుకోకుండా స్పీడ్ గా ముందుకు వెళ్లడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి