iDreamPost
android-app
ios-app

మూవీ ప్రమోషన్‌కి డబ్బుల్లేవు.. సహాయం చేయండి ప్లీజ్: పేకమేడలు హీరో

  • Published Jun 25, 2024 | 8:41 PM Updated Updated Jun 25, 2024 | 8:58 PM

Young Hero Wants Help: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. అయితే కంటెంట్ ఉన్న సినిమాలు కొన్ని జనాల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోవడం వల్ల సరిగా ఆడని సందర్భాలు కూడా ఉన్నాయి. సినిమా అన్నాక మూవీ ప్రమోషన్స్ కంపల్సరీ. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా తప్పదు. అయితే మూవీ ప్రమోషన్స్ కి డబ్బులు లేవని పేకమేడలు హీరో ఆడియన్స్ ని అడుగుతున్నారు.

Young Hero Wants Help: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. అయితే కంటెంట్ ఉన్న సినిమాలు కొన్ని జనాల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోవడం వల్ల సరిగా ఆడని సందర్భాలు కూడా ఉన్నాయి. సినిమా అన్నాక మూవీ ప్రమోషన్స్ కంపల్సరీ. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా తప్పదు. అయితే మూవీ ప్రమోషన్స్ కి డబ్బులు లేవని పేకమేడలు హీరో ఆడియన్స్ ని అడుగుతున్నారు.

  • Published Jun 25, 2024 | 8:41 PMUpdated Jun 25, 2024 | 8:58 PM
మూవీ ప్రమోషన్‌కి డబ్బుల్లేవు.. సహాయం చేయండి ప్లీజ్: పేకమేడలు హీరో

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. తమ నటనతో మెస్మరైజ్ చేసే యంగ్ బ్లడ్ కి కొదవ లేదు. కానీ టాలెంట్ ఉన్నా కానీ రాక రాక అవకాశం వస్తే దాన్ని నిలబెట్టుకోవడంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. నెగిటివ్ రోల్స్ లో నటించిన ఈ నటుడికి రాక రాక హీరోగా అవకాశం వచ్చింది. అయితే మూవీని జనాల్లోకి తీసుకెళ్లడానికి డబ్బులు లేవని ప్రేక్షకులను సహాయం చేయమని అడుగుతున్నారు. మీరు కార్తీ నటించిన ‘నా పేరు శివ’ సినిమా చూసే ఉంటారు. ఆ మూవీలో నెగిటివ్ క్యారెక్టర్ లో నలుగురు యువకులు నటిస్తారు. వారిలో ఈ వినోద్ కిషన్ ఒకరు. ఇతని యాక్టింగ్ అందులో చూసే ఉంటారు.

ఒకప్పుడు పాత సినిమాల్లో విలన్స్ ని చూస్తే అప్పటి తరం వాళ్ళు ఎంత కసిగా పళ్ళు కొరుక్కుని.. తిట్టుకునేవారో ఈ మూవీలో నెగెటివ్ రోల్ లో నటించిన వినోద్ కిషన్ ని కూడా చూసినప్పుడు అలానే కోప్పడతారు. అంతలా నెగిటివ్ క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయి నటించిన వినోద్ కిషన్.. ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా నటించారు. అయితే మొదటిసారిగా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. పేకమేడలు అనే సినిమాలో నటించారు. అయితే మూవీ ప్రమోషన్స్ కోసం తన దగ్గర డబ్బులు లేవని.. సహాయం చేయండి అంటూ వేడుకున్నారు. దీనికి సంబందించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

ఆ వీడియోలో వినోద్ కిషన్ మాట్లాడుతూ.. ‘హాయ్ అండి.. నా పేరు వినోద్ కిషన్. ‘నా పేరు శివ’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశాను. తెలుగులో తొలిసారిగా హీరోగా పేకమేడలు అనే సినిమాలో నటించాను. లక్ష్మణ్ అనే ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ నాది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అయితే మూవీ ప్రమోషన్ కోసం డబ్బులు కావాలండి. 5 రూపాయలు, పది రూపాయలు ఎంతైనా గానీ ఈ క్యూఆర్ కోడ్ కి స్కాన్ చేసి పంపించండి. ప్లీజ్ హెల్ప్ మి. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. హిట్ అయ్యాక వచ్చిన లాభాల నుంచి వడ్డీతో కలిపి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా’ అంటూ ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేశారు.

అయితే ఇది ప్రమోషన్ లో భాగంగా చేసిన వీడియో అని తెలుస్తోంది. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే.. ఒక వీడియో లింక్ ఒకటి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియో ఫోన్ పే, గూగుల్ పేలో స్కాన్ చేసి చూడండి. అసలు విషయం తెలుస్తుంది. ఇక పేకమేడలు సినిమా విషయానికొస్తే.. ఈ మూవీలో వినోద్ కిషన్ సరసన అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీకి నీలగిరి మామిళ్ళ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై నెలలో రిలీజ్ కాబోతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss