iDreamPost

విషాదం.. క్లాస్‌ రూంలోనే గుండెపోటుతో కుప్పకూలిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థి!

ఈ మద్య కాలంలో హార్ట్ ఎటాక్ మరణాలు ఎక్కువ అయ్యాయి.. చిన్న, పెద్దా అనే యవసుతో సంబంధం లేకుండా ఉన్నచోటే కుప్పకూలి మరణిస్తున్నారు.

ఈ మద్య కాలంలో హార్ట్ ఎటాక్ మరణాలు ఎక్కువ అయ్యాయి.. చిన్న, పెద్దా అనే యవసుతో సంబంధం లేకుండా ఉన్నచోటే కుప్పకూలి మరణిస్తున్నారు.

విషాదం.. క్లాస్‌ రూంలోనే గుండెపోటుతో కుప్పకూలిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థి!

ఇటీవల దేశంలో గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన వారు హఠాత్తుగా ఉన్నచోటే కుప్పకూలి చనిపోతున్నారు. ఒకప్పుడు వృద్దాప్యంలోనే వచ్చే హార్ట్ ఎటాక్ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వస్తుంది. మానసిక ఒత్తిడి, ఎక్కువగా వ్యాయామాలు చేయడం, పెద్దగా సౌండ్స్ విన్నపుడు, అనారోగ్యం సమస్యలు, ఎక్కువ సమయం డ్యాన్స్, స్పోర్ట్స్ ఆడటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. ఏది ఏమైనా అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా కన్నుమూయడం దుఖాఃన్ని కలిగిస్తుంది. తాజాగా ఓ విద్యార్థి క్లాస్ రూమ్ లో పాఠాలు వింటూనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంతో భవిష్యత్ ఉన్న ఉన్న ఓ సివిల్ సర్వీసెస్ విద్యార్థి జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (MPPSC) ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థి ఇండర్ లోని ఓ కోచింగ్ సెంటర్ లో క్లాస్ వింటూ అక్కడే కుప్పకూలి మరణించాడు. మృతుడు సాగర్ జిల్లాకు చెందిన రాజా లోధి (18) గా గుర్తించారు. క్లాస్ వింటున్న రాజా లోధికి అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో ఇబ్బంది పడ్డాడు, పక్కనే ఉన్న విద్యార్థులు గమనించి సహాయం అందించేందుకు ప్రయత్నించినట్లుగా అక్కడ సీసీ కెమెరాలరలో రికార్డు అయ్యింది.

ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన రాజా లోధి స్నేహితులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఈ విషయం మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న రాజా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడి తండ్రి పిహెచ్ఈ విభాగంలో పనిచేస్తున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపించి పోలీసులు మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఇటీవల ఇండోర్ లో ముగ్గురు యువకులు హార్ట్ ఎటాక్ తో మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి