iDreamPost
android-app
ios-app

మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

Gold and Silver Rates: గత కొన్నిరోజులుగా పసిడి ధరలు దోబూచులాడుతున్నాయి.. ఒకరోజు తగ్గితే.. మరో రోజు అమాంతం పెరిగిపోతున్నాయి. నిన్న పసిడి ధరలు షాక్ ఇవ్వగా.. నేడు ఊరటనిచ్చాయి.

Gold and Silver Rates: గత కొన్నిరోజులుగా పసిడి ధరలు దోబూచులాడుతున్నాయి.. ఒకరోజు తగ్గితే.. మరో రోజు అమాంతం పెరిగిపోతున్నాయి. నిన్న పసిడి ధరలు షాక్ ఇవ్వగా.. నేడు ఊరటనిచ్చాయి.

మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

బంగారం ఈ పేరు వినగానే మహిళలు ప్రాణాలు లేచి వస్తాయి.. పసిడి అంటే అంతగా ఇష్టపడతారు. పెళ్లిళ్లు, పండగలు ఇతర శుభకార్యాలకు మహిళలు బంగారు ఆభరణాలు ధరించేందుకు తెగ ఇష్టపడతారు. అంతేకాదు సొసైటీలో ఎంత బంగారు ఉంటే.. అంత గౌరవంగా ఫీల్ అవుతారు. ఈ మధ్య మధ్యతరగతి కుటుంబీకులు పసిడి కొనుగోలు చేసి జాగ్రత్త పర్చుకుంటున్నారు. భవిష్యత్ లో పసిడి తులం లక్ష వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏ ఆపద సమయంలో అయినా పసిడి పనికివస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి పై పడటంతో ధరల్లో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. ఈ రోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

పసిడి గురించి ఎంత చెప్పినా తక్కువే.. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు పసిడి అంటే ఎంతో ఇష్టపడతారు. ఒకప్పుడు బంగారం ఆభరణాలు గా మాత్రమే చూశారు.. ఇప్పుడు పసిడి ఇన్వెస్ట్‌మెంట్ గా చూస్తున్నారు. పసిడి ధరలు గత ఏడాది కన్నా ఈ ఏడాది ఐదు వేల వరకు పెరిగింది. ఇటీవల పసిడి ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూ వచ్చాయి. గత నెల చివరల్లో కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న పసిడి ధరలు అమాంతం పెరిగిపోయాయి.. తాజాగా ఊరట నిస్తున్నాయి. శనివారం (జూన్ 1) నాటికి పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.66,690 ఉండగా, 24 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.72,750 వద్ద కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.66,840 ఉండగా, 24 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ. 72,900 వద్ద కొనసాగుతుంది. ముంబై,కోల్‌కొతా,బెంగళూరు, కేరళలో 22 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.66,690 ఉండగా, 24 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.72,750 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.67,290 ఉండగా, 24 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.73,410 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో రూ. 100 తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 95,400 వద్ద ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 99,900 కి చేరింది. ముంబై, కోల్ కొతా లో కిలో వెండి రూ.95,400, కేరళాలో రూ.99,900, బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 95,700 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి