iDreamPost
android-app
ios-app

ఒక్క రోజులోనే భారీ షాక్ ఇచ్చిన గోల్డ్ రేట్.. ఎంత పెరిగిందంటే

  • Published Nov 30, 2023 | 8:34 AMUpdated Nov 30, 2023 | 8:34 AM

బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కాబట్టి.. కచ్చితంగా ఎంతో కొంత గోల్డ్ కొనాల్సిన అవసరం ఉంటుంది. కానీ పెరుగుతున్న ధర చూసి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. క్రితం సెషన్ లో స్థిరంగా ఉన్న రేటు నేడు భారీగా పెరిగింది. ఆ వివరాలు..

బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కాబట్టి.. కచ్చితంగా ఎంతో కొంత గోల్డ్ కొనాల్సిన అవసరం ఉంటుంది. కానీ పెరుగుతున్న ధర చూసి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. క్రితం సెషన్ లో స్థిరంగా ఉన్న రేటు నేడు భారీగా పెరిగింది. ఆ వివరాలు..

  • Published Nov 30, 2023 | 8:34 AMUpdated Nov 30, 2023 | 8:34 AM
ఒక్క రోజులోనే భారీ షాక్ ఇచ్చిన గోల్డ్ రేట్.. ఎంత పెరిగిందంటే

బంగారం కొనాలనుకునే వారు ఇప్పట్లో ఆ ప్రయత్నం చేయకపోతే మంచిది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. దీపావళి పండుగ తర్వాత నుంచి గోల్డ్ రేటు అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతుంది. పెరగడమే తప్ప దిగి రావడం లేదు. ఇప్పటికే పసిడి ధర ఈ ఏడాది గరిష్టాలకు చేరుకుంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. నిన్న స్థిరంగా కొనసాగిన బంగారం ధర ఈరోజు అమాంతం పెరిగిపోయింది. ఒక్క రోజులోనే భారీగా పెరిగి.. ఊహించని షాక్ ఇచ్చింది. అటు గ్లోబల్ బులియన్ మార్కెట్ లో సైతం గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. ఆ ప్రభావం దేశీయంగా కూడా ఉంది. మరి నేడు మన దగ్గర బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి.. అంటే..

దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధర నేడు భారీగా పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ రేటు మీద ఏకంగా రూ.750 పెరగడం గమనార్హం. నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ పసిడి ధర పది గ్రాముల మీద 750 రూపాయలు పెరిగింది. దాంతో నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 58,100 వద్దకు చేరింది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం రేటు పది గ్రాముల మీద రూ. 820 పెరిగి రూ. 63,380 వద్దకు చేరింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో సైతం పసిడి ధర దూసుకుపోయింది. నేడు హస్తినలో 22 క్యారెట్ బంగారం ధర పది గ్రాముల మీద 750 రూపాయలు పెరిగి.. రూ. 58,250 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన పుత్తడి రేటు కూడా 10 గ్రాముల మీద రూ. 820 పెరిగి రూ. 63,530 వద్ద అమ్ముడవుతోంది.

బంగారం బాటలోనే వెండి

ఇవాళ వెండి రేటు కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు సిల్వర్ రేటు కిలో మీద ఏకంగా రూ.700 మేర పెరిగింది. గురువారం నాడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సిల్వర్ రేటు కిలో మీద రూ.700 పెరిగి ప్రస్తుతం రూ. 82,200 వద్ద ట్రేడవుతోంది. అలానే దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో సైతం వెండి ధర కిలో మీద రూ. 700 పెరిగి ప్రస్తుతం రూ. 79,200 మార్క్ కు చేరింది. ఢిల్లీతో పోలిస్తే.. హైదరాబాద్ లో వెండి రేటు కాస్త ఎక్కువగానూ.. గోల్డ్ ధర కాస్త తక్కువగానూ ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులే ఇందుకు కారణం.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయి దిశగా పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2046 డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 25 డాలర్లకు చేరింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి