iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు షాక్ ఇచ్చిన గోల్డ్ రేట్.. ఒక్కరోజే ఇంత పెరిగిందేంటి

  • Published Nov 28, 2023 | 8:11 AMUpdated Nov 28, 2023 | 8:11 AM

హమ్మయ్యా బంగారం ధర తగ్గింది.. స్థిరంగా కొనసాగుతుంది.. కొనుగోలు చేద్దామనుకున్న వారికి భారీ షాక్ తగిలింది. ఒక్క రోజులోనే గోల్డ్, సిల్వర్ రేట్లు ఊహించని విధంగా పెరిగాయి. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..

హమ్మయ్యా బంగారం ధర తగ్గింది.. స్థిరంగా కొనసాగుతుంది.. కొనుగోలు చేద్దామనుకున్న వారికి భారీ షాక్ తగిలింది. ఒక్క రోజులోనే గోల్డ్, సిల్వర్ రేట్లు ఊహించని విధంగా పెరిగాయి. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..

  • Published Nov 28, 2023 | 8:11 AMUpdated Nov 28, 2023 | 8:11 AM
పసిడి ప్రియులకు షాక్ ఇచ్చిన గోల్డ్ రేట్.. ఒక్కరోజే ఇంత పెరిగిందేంటి

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి షాకింగ్ వార్త అని చెప్పవచ్చు. క్రితం సెషన్లో కాస్త శాంతించిన ధర.. ఒక్క రోజులోనే భారీ పెరిగింది. ఇక సిల్వర్ రేటుకైతే అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇప్పటికే ఈ ఏడాది గరిష్టాలకు చేరిన పుత్తడి ధర.. మరింత పైపైకి చేరుతోంది. పెళ్లిళ్ల సీజన్ల వేళ రేటు తగ్గితే ఎంతో కొంత కొనుగోలు చేద్దామని భావించిన వారు.. పెరుగుతున్న పసిడి రేటు చూసి ఎలా స్పందించాలో అర్థం కాకుండా ఊరుకున్నారు. గ్లోబల్ మార్కెట్లో క్రితం సెషన్‌లో గోల్డ్ రేట్లు దిగివచ్చాయి. దాంతో దేశీయంగా పసిడి ధర తగ్గుతుందని భావించని వారికి ఊహించని షాక్ తగిలింది. మరి నేడు బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి.. దేశీయ బులియన్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

క్రితం సెషన్లో స్థిరంగా కొనసాగిన బంగారం ధర నేడు మాత్రం భారీగా పెరిగింది. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ. 250 మేర పెరిగింది. దాంతో నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్ పసిడి పది గ్రాముల ధర రూ. 57,350కి చేరింది. అలాగే 24 క్యారెట్ మేలిమి బంగారం రేటు సైతం పది గ్రాముల మీద రూ. 270 పెరిగి.. రూ. 62,560కి చేరింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో కూడా నేడు గోల్డ్ రేటు పైకి ఎగబాకింది. నేడు హస్తినలో 22 క్యారెట్ గోల్డ్ పది గ్రాముల ధర రూ.250 పెరిగి రూ. 57,500 కి చేరింది. అలాగే 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర కూడా భారీగానే పెరిగింది. నేడు హస్తినలో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల మీద రూ.270 పెరిగి రూ. 62,710 స్థాయి వద్ద అమ్ముడవుతోంది

రూ.1300 పెరిగిన వెండి..

నేడు బంగారం ధర పెరగ్గా.. సిల్వర్ రేటు కూడా నేనేమన్నా తక్కువ అన్నట్లు పరుగులు తీసింది. నేడు దేశీయ బులియన్ మార్కెట్లో వెండి ధర భారీగా పెరిగింది. ఢిల్లీలో మంగళవారం నాడు వెండి ధర కిలో మీద రూ.1300 పెరిగి రూ. 78,500 మార్క్‌ను తాకింది. ఇక మన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా సిల్వర్ రేటు భారీగానే పెరిగింది. నేడు భాగ్యనగరంలో సిల్వర్ ధర కిలో మీద రూ. 1300 పెరిగి రూ.81,500 మార్క్ కి చేరింది. ఢిల్లీలో వెండి ధరలు తక్కువగా ఉంటే.. మన హైదరాబాద్‌లో మాత్రం ఎక్కువగా ఉంటుంది. అయితే, బంగారం రేటు ఇందుకు వ్యతిరేకంగా ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులే ఇందుకు కారణం.

క్రితం సెషన్లో అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా దిగి రాగా.. నేడు మాత్రం వీటి ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2016 డాలర్ల పైన ట్రేడింగ్ అవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.74 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి