iDreamPost
android-app
ios-app

అక్కడ భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ధర ఎంతంటే!

  • Published Jul 28, 2023 | 7:42 AM Updated Updated Jul 28, 2023 | 7:42 AM
  • Published Jul 28, 2023 | 7:42 AMUpdated Jul 28, 2023 | 7:42 AM
అక్కడ భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ధర ఎంతంటే!

బంగారం ధర రాకెట్‌ కన్నా వేగంతో పరుగులు తీస్తుంది. కొన్ని రోజులు పాటు స్వల్పంగా తగ్గడం.. ఆ వెంటనే వినియోగదారులకు షాక్‌ ఇచ్చే రేంజ్‌లో పెరగడం చేస్తోంది. కనీసం అన్‌సీజన్‌లో అయినా పుత్తడి ధర దిగి వస్తుందోమే అని భావించినా అది కూడా అత్యాశే అయ్యింది. ఈ ఏడాది అన్‌సీజన్‌ ఆషాఢం, అధిక శ్రావణ మాసంలో కూడా పుత్తడి ధర పరుగులు పెడుతోంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే వెండి, బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సాధరణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగి వస్తే.. దేశీయ బులియన్‌ మార్కెట్‌లో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. కానీ నేడు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్‌ దిగి వచ్చినా.. మన దగ్గర మాత్రం.. భారీగా పెరిగి షాకిచ్చింది. ఇంతకు మన దగ్గర నేడు బంగారం ధర ఎంత పెరిగింది.. వెండి ధర ఎంత ఉంది అంటే..

నేడు అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గినా.. మన దగ్గర మాత్రం దిగిరావడం లేదు. స్థానికంగా బంగారానికి ఉన్న డిమాండ్‌ కారణంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. మన దగ్గర నేడు బంగారం ధర 10 గ్రాములు మీద 300 రూపాయలు పెరిగి.. రెండు రోజుల్లోనే రేటు రూ. 450 వరకు పెరిగింది. ఇక నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ. 300 పెరిగి రూ. 55,450 వద్దకు చేరింది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు 10 గ్రాముల మీద రూ. 330 పెరిగి రూ. 60,490 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర పెరిగింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ. 300 పెరిగి రూ. 55,600 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ గోల్డ్‌ రేటు 10 గ్రాముల మీద రూ. 320 పెరిగి రూ.60,640 పలుకుతోంది.

బంగారం బాటలోనే వెండి..

నేడి వెండి ధర బంగారం బాటలోనే పయణిస్తోంది. నేడు కిలో వెండి ధర ఏకంగా 1000 రూపాయలు పెరిగింది. ఈ రెండు రోజుల్లోనే ఢిల్లీలో కిలో వెండి ధర ఏకంగా 1400 రూపాయలు పెరిగింది. నేడు హస్తినలో కిలో వెండి రేటు రూ. 78,400 వద్ద ట్రేడవుతోంది. ఇక మన హైదరాబాద్‌లో చూసుకుంటే నేడు కిలో వెండి రేటు ఏకంగా రూ. 1100 పెరిగి ప్రస్తుతం రూ. 81,500 మార్క్ వద్ద ట్రేడవుతోంది.. హైదరాబాద్‌లో వెండి రేటు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ బంగారం ధర మాత్రం తక్కువగా లభిస్తుంటుంది. అందుకు ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ఉండే పన్నులు, కమీషన్ల వంటివి కారణంగా మారతాయి.

మన దగ్గర బంగారం, వెండి ధర విపరీతంగా పెరిగితే.. అంతర్జాతీయ మార్కెట్లో మాత్ర పసిడి ధరలు ఈ ఒక్క రోజులో భారీగా కుప్పకూలింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో డాలర్ విలువ రెండు వారాల గరిష్ఠానికి చేరింది. దాంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. నేడు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఒక్క రోజులో దాదాపు 30 డాలర్ల మేర పడిపోయింది. క్రితం సెషన్‌లో 1973 డాలర్లకు పైన ట్రేడయిన బంగారం ధర ఇవాళ 1948 డాలర్లకు దిగివచ్చింది. మరోవైపు.. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.18 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.