P Krishna
Hyderabad Crime News: ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు పాల్పపడుతున్నారు.
Hyderabad Crime News: ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు పాల్పపడుతున్నారు.
P Krishna
ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి షాట్ టెంపర్ కి గురై దారుణాలకు పాల్పపడుతున్నారు. తాము చేసిన తప్పేంటో తెలిసి తర్వాత కుమిలిపోతున్నారు. చాలా వరకు అనారోగ్య సమస్యలు, వివాహేతర సంబంధాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబాల్లో కలహాలు రావడంతో కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. అవి కాస్త చిలికి చిలికి గాలవానగా మారి హత్యలు చేసేవారకు వెళ్తున్నాయి. పోలీసులు, సైక్రియార్టిస్ట్ లు ఎంతగా కౌన్సిలింగ్ చేసినా వారి బుద్ది మారడం లేదు. హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కొడుకు సరిగా చదవడం లేదని కన్నతండ్రి కూరగాలు కోసే కత్తితో పొడిచి చంపేసిన ఘటన కర్మన్ ఘాట్ లో తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ కి చెందిన జైపాల్ అనే యువకుడు డిగ్రీ మధ్యలో ఆపేసి జులాయిగా తిరుగుతున్నాడు. ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ఎప్పుడూ చేతిలో సెల్ ఫోన్ తో గడిపేవాడు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండకుండా నిత్యం స్నేహితులతో తిరుగుతూ మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. కొడుకు ఏ క్షణంలో ఏం ఉపద్రవం తీసుకువస్తాడో అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు. బంధువులు, చుట్టుపక్కల వాళ్లతో కొడుక్కి ఎన్నో రకాలుగా చెప్పించారు. కానీ జైపాల్ తీరులో మార్పు రాలేదు సరి కదా.. అందరి ముందు తన పరువు తీస్తున్నారంటూ కుటుంబ సభ్యులతో గొడవకు దిగేవాడు. ఇటీవల పండగ సందర్భంగా తండ్రి కొడుకుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. కొడుకు చేస్తున్న నిర్వాకంతో విసుగెత్తిపోయిన తండ్రి ఇలా అయితే అస్సలు కుదరదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.
డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఏదైనా మంచి ఉద్యోగం చేసి ఇంటికి ఎంతో కొంత ఆసరా కావాలని జైపాల్ ని మందలించాడ. ఈ క్రమంలోనే తండ్రీ కొడుకు మధ్య మాటా మాటా పెరిగి పెద్దది అయ్యింది. కొడుకు చెప్పిన మాట వినకపోవడం, ఎదిరించి గొడవ పెట్టుకోవడంతో తండ్రి విచక్షణ కోల్పోయాడు. అక్కడే కూరగాలు కోసే కత్తి తీసుకొని కొడుకుని పొడిచాడు. దీంతో గట్టిగా కేకలు వేస్తూ జైపాల్ కిందపడి పోయాడు. చుట్టు పక్కల వాళ్లు ఇంట్లోకి రాగానే రక్తం కారుతున్న జైపాల్ చూసి హడలిపోయారు. అప్పటికే తీవ్ర రక్తస్త్రావంతో జైపాల్ ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే ఓవైసీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన కొడుకును కావాలని అలా చేయలేదని.. బుద్దిమార్చుకో అని చెబుతుండగా తనపైకి గొడవకు వచ్చాడని తండ్రి అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న జైపాల్ చదువుకోకుండా జులాయిగా తిరగడం వల్ల అటు కుటుంబ సభ్యులు, ఇటు సొసైటీలో ప్రజలు ఇబ్బంది పాలయ్యారు. అది భరించలేక తండ్రి దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.