iDreamPost
android-app
ios-app

రూ. 4 లక్షల కోసం దారుణం.. భర్త, అత్త మామ కలిసి వివాహితను..

Married Women Dowry harassment: వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైపోయింది. 4 లక్షల కోసం భర్త, అత్త మామ కలిసి వివాహితను ఉరివేసి చంపారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.

Married Women Dowry harassment: వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైపోయింది. 4 లక్షల కోసం భర్త, అత్త మామ కలిసి వివాహితను ఉరివేసి చంపారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.

రూ. 4 లక్షల కోసం దారుణం.. భర్త, అత్త మామ కలిసి వివాహితను..

కాలం మారుతున్నా వరకట్నం అనే భూతం మహిళలను పీడిస్తూనే ఉంది. వరకట్నం తీసుకోవడం నేరమని చట్టం చెబుతోంది. అయినా సమాజంలో మార్పు రావడం లేదు. వరకట్నం యువతుల పాలిట శాపంగా మారింది. వరకట్నం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వివాహితలు ఎంతోమంది ఉన్నారు. వరకట్న వేధింపులతో మహిళలకు జీవితమే లేకుండా పోతున్నది. కోడలిని కూతురులా చూసుకోవాల్సిన అత్తమామలు మృత్యుపాశాలుగా మారుతున్నారు. కష్టసుఖాల్లో తోడుండాల్సిన భర్త అదనపు కట్నం తేవాలని వేధిస్తూ కాటికి పంపుతున్నారు. నిండు నూరేళ్లు జీవించాల్సిన వారు వరకట్నం కారణంగా అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. అత్తింటి వేధింపులు తాళలేక లోకం విడిచి వెళ్తున్నారు.

పెళ్లిలో ఇచ్చిన కట్నం చాలలేదని వివాహితలను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. డబ్బు మీద ఆశతో భార్యను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన వారు వరకట్న వేధింపులకు బలైపోతున్నారు. తాజాగా మరో మహిళ వరకట్న వేధింపులకు బలైపోయింది. 4 లక్షలు అదనపు కట్నం ఇవ్వలేదని వివాహితను అత్తింటివారు అంతమొందించారని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. భర్త, అత్త మామ కలిసి తమ కూతురు ప్రాణం తీశారని మృతురాలి తల్లి ఆరోపిస్తుంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దస్తురాబాద్ మండంలోని రేవోజీపేట గ్రామానికి చెందిన సంద నాగరాజుకు జగిత్యాల జిల్లా సారాంగపూర్‌ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన లతతో ముడేళ్ల క్రితం వివాహం జరిగింది.

కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి 15 నెలల కుమారుడు ఉన్నాడు. కాగా కొన్ని రోజులుగా లతను అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటివారు వేధిస్తున్నారు. భర్త నాగరాజు, అత్త, మామ సంద సత్తవ్వ, వెంకటి అదనపు కట్నం తేవాలని లతను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వరకట్న వేధింపులతో ఆ ఇల్లాలు విసిగిపోయింది. మానసిక వేదనకు గురైంది. అత్తింటి టార్చర్ భరించేకంటే చనిపోవడమే బెటర్ అని నిర్ణయించుకుంది. వేధింపులు తాళలేక శుక్రవారం బాత్‌రూంలో ఉరివేసుకుని చనిపోయింది. కుతురు మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారు. తమ కూతురును అత్తింటి వారే ఉరేసి చంపారని ఆరోపించారు. తమ కుమార్తె ఉరేసుకుని చనిపోయేంత పిచ్చిది, పిరికిది కాదంటూ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నది.

సంఘటన స్థలాన్ని తహసీల్దార్‌ నావాజ్‌ సర్ఫరాజ్‌ చేరుకుని పంచనామా చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతురాలి తల్లి పోగుల మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా మృతురాలి బంధువుల ఆందోళనతో ఖానాపూర్ ఏరియా ఆస్పత్రి వద్ద హైటెన్షన్ నెలకొన్నది. తమకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. వరకట్న వేధింపులతో మహిళ మృతి చెందిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.