iDreamPost
android-app
ios-app

Ola S1xపై క్రేజీ ఆఫర్.. రూ. 59 వేలకే.. 190KM రేంజ్.. లేట్ చేయకండి..

Crazy Deals On OLA S1X Model: ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఓలా ఎస్ 1ఎక్స్ పై క్రేజీ ఆఫర్ ను ప్రకటించింది. కేవలం 59 వేలకే ఈవీని అందిస్తోంది. త్వరపడండి.

Crazy Deals On OLA S1X Model: ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఓలా ఎస్ 1ఎక్స్ పై క్రేజీ ఆఫర్ ను ప్రకటించింది. కేవలం 59 వేలకే ఈవీని అందిస్తోంది. త్వరపడండి.

Ola S1xపై క్రేజీ ఆఫర్.. రూ. 59 వేలకే.. 190KM రేంజ్.. లేట్ చేయకండి..

పెట్రోల్ ఖర్చులకు భయపడుతున్న వారు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగిపోయింది. వరల్డ్ వైడ్ గా ఈవీలను యూజ్ చేసే వారి సంఖ్య ఎక్కువైంది. భవిష్యత్ అంతా ఈవీలదే అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు, కార్లు రోడ్లపై దూసుకెళ్తున్నాయి. ఆటో మొబైల్ రంగంలో ఈవీలు సంచలనం సృష్టిస్తున్నాయి. డ్రైవ్ చేసేందుకు ఈజీగా ఉండడం, ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతుండడంతో ఈవీల సేల్ పెరుగుతున్నది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు లేటెస్ట్ టెక్నాలజీతో ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాహనదారులను ఆకర్షిస్తున్నాయి.

సింగిల్ ఛార్జ్ తో వందల కిలోమీటర్లు ప్రయాణించే వీలుండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. మరి మీరు కూడా ఈమధ్యకాలంలో కొత్త ఈవీ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ప్రముఖ ఈవీ కంపెనీ ఓలా కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. బాస్ ఆఫ్ ఆల్ సేవింగ్స్ పేరుతో ఆఫర్ ను తీసుకొచ్చింది. కస్టమర్లను ఆకర్షించేందుకు సేల్స్ పెంచుకునేందుకు తక్కువ ధరకే ఈవీని అందిస్తోంది. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో ఓలా కంపెనీ ఈవీల ధరలను తగ్గిస్తోంది. ఆఫర్లో భాగంగా ఓలాకు చెందిన S1x ఈవీని కేవలం 59 వేల 999కే అందిస్తోంది. S1x అసలు ధర రూ. 75 వేలుగా ఉంది. ఆఫర్లో భాగంగా S1xపై 15 వేలు తగ్గించినట్లు సంస్థ వెల్లడించింది.

ఓలా కేవలం S1 x సిరీస్ వెహికల్ మీదే కాకుండా మరో రెండింటిపై కూడా డిస్కౌంట్ ప్రకటించింది. s1 proపై రూ.15,000, అలాగే S1 air స్కూటర్‌పై రూ.7,000 వరకు తగ్గింపు అందిస్తోంది. S1x సింగిల్ ఛార్జ్ తోనే 190 కి. మీలు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. ఎస్‌1 ఎక్స్‌ 4kWh ఈవీ కేవలం 3.3 సెకన్లలోనే 0-40 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుందని కంపెనీ వెల్లడించింది. ఎస్‌1 ఎక్స్‌ 4kWh రెడ్‌ వెలాసిటీ, మిడ్‌నైట్‌, వోగ్‌, స్టీలర్‌, ఫంక్‌, పోర్స్‌లెయిన్‌ వైట్‌, లిక్విడ్‌ సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది. ఎస్1 ఎక్స్ టచ్​స్క్రీన్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​కి బదులుగా 3.5 ఇంచ్​ ఎల్​సీడీ స్క్రీన్​ని కలిగి ఉంటుంది. ఫిజికల్ కీతో వస్తుంది. ఓలా ఈవీ కొనాలనుకునే వారు సమీప షోరూంలో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. బెస్ట్ ఈవీ కావాలనుకునే వారు ఓలా ఆఫర్ ను మిస్ చేసుకోకండి. ఈవీలపై డిస్కౌంట్ కోసం చూసే వారు ఓలా ఆఫర్ పై ఓ లుక్కేయండి.