iDreamPost
android-app
ios-app

పుష్ప 2 ట్రైలర్ కట్ రెడీ.. ఇక మాస్ తాండవమే

  • Published Nov 09, 2024 | 3:56 PM Updated Updated Nov 09, 2024 | 3:56 PM

Pushpa2: ఓ వైపు పుష్ప 2 టీం ఐటెం సాంగ్ , బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటూ లాస్ట్ మినిట్ టెన్షన్స్ లో ఉంది. దీనితో అభిమానులకు కూడా టెన్షన్ మొదలైంది. అసలు చెప్పిన టైం కు వస్తుందా లేదా అని సందేహాలు ఎక్కువయ్యాయి. అయినా సరే పుష్ప టీం మాత్రం ఏం కంగారొద్దు.. ఈసారి పుష్ప 2 తగ్గేదెలే అంటూ రిలీజ్ అప్డేట్స్ ఇస్తున్నారు.

Pushpa2: ఓ వైపు పుష్ప 2 టీం ఐటెం సాంగ్ , బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటూ లాస్ట్ మినిట్ టెన్షన్స్ లో ఉంది. దీనితో అభిమానులకు కూడా టెన్షన్ మొదలైంది. అసలు చెప్పిన టైం కు వస్తుందా లేదా అని సందేహాలు ఎక్కువయ్యాయి. అయినా సరే పుష్ప టీం మాత్రం ఏం కంగారొద్దు.. ఈసారి పుష్ప 2 తగ్గేదెలే అంటూ రిలీజ్ అప్డేట్స్ ఇస్తున్నారు.

  • Published Nov 09, 2024 | 3:56 PMUpdated Nov 09, 2024 | 3:56 PM
పుష్ప 2 ట్రైలర్ కట్ రెడీ.. ఇక మాస్ తాండవమే

ఓ వైపు పుష్ప 2 టీం ఐటెం సాంగ్ , బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటూ లాస్ట్ మినిట్ టెన్షన్స్ లో ఉంది. దీనితో అభిమానులకు కూడా టెన్షన్ మొదలైంది. అసలు చెప్పిన టైం కు వస్తుందా లేదా అని సందేహాలు ఎక్కువయ్యాయి. అయినా సరే పుష్ప టీం మాత్రం ఏం కంగారొద్దు.. ఈసారి పుష్ప 2 తగ్గేదెలే అంటూ రిలీజ్ అప్డేట్స్ ఇస్తున్నారు. పుష్ప రాజ్ ఆగమనం అయ్యే ఘడియలు వచ్చేశాయ్. ఎట్టి పరిస్థితిల్లో అనుకున్న టైం కు సినిమాను రిలీజ్ చేసేందుకు టీం రెడీ అవుతుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల తేదీ త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నాం అంటూ టీం ఓ పోస్ట్ ను షేర్ చేశారు. “ద రూల్ టేక్స్ ఓవర్” అంటూ మేకర్స్ క్రియేట్ చేసిన బజ్ సడెన్ గా సోషల్ మీడియాలో గట్టిగా సౌండ్ చేస్తుంది. టెన్షన్ లో ఉన్న అభిమానులను ఊపిరి పీల్చుకునేలా చేసింది ఆ పోస్ట్.

దీనితో ఇప్పుడు పుష్ప 2 పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. రీసెంట్ గా ఐటెం సాంగ్ కు సంబంధించిన ఓ ఫోటో కూడా లీక్ అయింది. శ్రీలీల , బన్నీ పక్కపక్కన నిలుచున్న ఫోటో ఒకటి నెట్టింట చెక్కర్లు కొడుతోంది. సో షూటింగ్ పనులు దాదాపు పూర్తి కావొస్తున్నట్లే. రిలీజ్ విషయంలో మాత్రం అనుకున్నది అనుకున్నట్లుగా చేసేందుకే మూవీ టీం ప్లాన్ చేస్తుంది. ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేశారు . కానీ ఈ మ్యాటర్ మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే టీం దగ్గర ఇప్పుడు అంత సమయం లేదు. ప్రమోషన్స్ అయితే ఉంటాయి కానీ.. వారు ప్లాన్ చేసినట్లుగా భారీ రేంజ్ లో ఉంటాయా లేదా అనేదే అందరికి అనుమానం.మొత్తానికి మూవీ టీం ట్రైలర్ ఎడిటింగ్ వర్క్ ఫినిష్ అయినట్లు ఓ క్లారిటీ అయితే ఇచ్చేశారు. దీనితో ఇప్పుడు ప్రేక్షకులు ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అప్పడే సినిమా కథ మీద సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ మొదలయ్యాయి. పుష్ప రాజ్ స్మగ్లర్ గానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా మారిపోతాడని టాక్. ఇప్పటివరకు రిలీజ్ అయినా పోస్టర్స్ చూస్తుంటే మూవీ కథ డిఫరెంట్ గా ఉండబోతుందని అర్ధమౌతుంది. భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ కూడా ఈసారి గట్టి ఇంపాక్ట్ చూపించబోతున్నట్లు తెలుస్తుంది . ముఖ్యంగా ఈసారి సుకుమార్ కథలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు.. ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసినట్లు టాక్. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీకి పెద్ద ఎసెట్ గా మారబోతున్నాయట. ఇక ఆ ట్రైలర్ కాస్త రిలీజ్ అయితే వీటి అన్నింటిపైనా ఓ క్లారిటీ వస్తుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetMadridbetJojobetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet