iDreamPost
android-app
ios-app

వీడేం మనిషిరా బాబు.. ఉమ్మేస్తూ షవర్మా తయారీ..

Shawarma: షవర్మా తింటున్నారా? అయితే జాగ్రత్త. హైదరాబాద్ లో ఉమ్మేస్తూ షవర్మా తయారు చేస్తున్న ఘటన వెలుగు చూసింది. తాజాగా షవర్మా తిని పలువురు ఆసుపత్రిపాలయ్యారు.

Shawarma: షవర్మా తింటున్నారా? అయితే జాగ్రత్త. హైదరాబాద్ లో ఉమ్మేస్తూ షవర్మా తయారు చేస్తున్న ఘటన వెలుగు చూసింది. తాజాగా షవర్మా తిని పలువురు ఆసుపత్రిపాలయ్యారు.

వీడేం మనిషిరా బాబు.. ఉమ్మేస్తూ షవర్మా తయారీ..

షవర్మ.. ఈ పదం వింటేనే ఆహార ప్రియులు వణికిపోతున్నారు. హైదరాబాద్ లో షవర్మా బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది. సరదాగా బయటికి వెళ్లినప్పుడు షవర్మా తిందామంటే భయపడేలా చేస్తుంది. హోటల్స్ లలో, స్ట్రీట్ ఫుడ్స్ తినాలంటేనే జనాలు భయపడాల్సిన పరిస్థితి. షవర్మా అంటేనే వికారం వచ్చేలా అయిపోయింది. క్వాలిటీ లేని పదార్థాలతో ఆహార పదార్దాలను తయారు చేస్తూ కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గడువు ముగిసిన ఐటెమ్స్ ను యూజ్ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

నాణ్యతలేని ఆహార పదార్థాలను కస్టమర్లకు అందిస్తూ ప్రాణాలు తోడేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మారాడం లేదు. జరిమానాలు విధిస్తున్నా పద్దతి మార్చుకోవడం లేదు. బిర్యానీ, మోమోస్, షవర్మా ఇలా ఏ ఐటెమ్ తీసుకున్న కల్తీనే దర్శనమిస్తున్నది. ఆహార పదార్థాల్లో బొద్దింకలు, పరుగులు దర్శనమిచ్చి ఫుడ్ లవర్స్ ను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల మోమోస్ తిని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిజామాబాద్ లో బిర్యానీ తిని ఫుడ్ పాయిజన్ కారణంగా ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటనలు మరువక ముందే షవర్మా తిని నలుగురు యువకులు ఆసుపత్రిపాలయ్యారు.

దారుణం ఏంటంటే.. షవర్మాలో ఉమ్మేస్తూ తయారు చేస్తున్నారు. షవర్మా ఇష్టంగా తినే వారికి ఇది చూస్తే జీవితంలో మళ్లీ తినాలనిపించదు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో చోటు చేసుకుంది. షవర్మ తిని నలుగురు యువకులు అస్వస్థతకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లోతుకుంటలోని గ్రిల్ హౌస్ లో నలుగురు యువకులు షవర్మ తిన్నారు. తిన్న కొద్దిగంటల్లోనే వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే వారు ఆసుపత్రిలో చేరారు. ఘటనపై బాధితుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ గ్రిల్ హౌస్ ను గతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు 3సార్లు మూసివేశారు. అయినా యాజమాన్యం తీరులో మార్పురాలేదు. గ్రిల్ హౌస్ హోటల్ ను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. షవర్మా కారణంగా ఆరోగ్యం చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే హోటల్స్ పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు రిపీట్ కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఉమ్మేస్తూ షవర్మా తయారు చేస్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.