iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్ 33 మూవీ డైరెక్టర్ ఫిక్స్ ..?

  • Published Nov 09, 2024 | 5:29 PM Updated Updated Nov 09, 2024 | 5:29 PM

NTR 33 Update: ప్రస్తుతం తారక్ వార్ 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసందే. ఇక ఆ సినిమా అయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో సినిమా.ఈ సినిమా ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. ఈలోపే ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ గురించి బజ్ మొదలైంది. NTR 33 సినిమాకు దాదాపు దర్శకుడు కూడా ఫిక్స్ అయినట్లు ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

NTR 33 Update: ప్రస్తుతం తారక్ వార్ 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసందే. ఇక ఆ సినిమా అయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో సినిమా.ఈ సినిమా ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. ఈలోపే ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ గురించి బజ్ మొదలైంది. NTR 33 సినిమాకు దాదాపు దర్శకుడు కూడా ఫిక్స్ అయినట్లు ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

  • Published Nov 09, 2024 | 5:29 PMUpdated Nov 09, 2024 | 5:29 PM
ఎన్టీఆర్ 33 మూవీ డైరెక్టర్ ఫిక్స్ ..?

దేవరతో ఎన్టీఆర్ పేరు వరల్డ్ వైడ్ గా మోత మోగిపోయింది. ఫ్యాన్స్ అంతా గర్వంగా కాలర్ ఎగరేశారు. రీసెంట్ గా ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చింది దేవర. ఇక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఇక అభిమానుల ఆశలన్నీ కూడా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల మీదే ఉన్నాయి. ప్రస్తుతం తారక్ వార్ 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికపుడు వస్తూనే ఉన్నాయి. మొదటి సారి నేరుగా ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనితో అంచనాలు ఇంకాస్త పెరిగాయి. పైగా వార్ 2 దర్శకుడు ఎన్టీఆర్ యాక్టింగ్ కు ఫిదా అయ్యాడట. యాక్టింగ్ విషయంలో తారక్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు టాక్ కూడా వచ్చింది. ఈ లెక్కన వార్ 2 ఎదో విధ్వంసం సృష్టించబోతుందని అర్ధమౌతుంది.

ఇక ఆ సినిమా అయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో సినిమా ఉందన్న సంగతి తెలిసిందే. తారక్ కోసం భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా బడ్జెట్ , కథ గురించి కూడా రకరకాల టాక్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ కూడా తన పాత సినిమా ఫ్లేవర్స్ ఎక్కడా కనిపించకుండా.. సరికొత్తగా తారక్ స్క్రీన్ ప్రెజన్స్ ను చూపించబోతున్నాడని సమాచారం. ఆల్రెడీ ప్రశాంత్ వర్క్ మీద ఓ అంచనా ఉంది. సో ఇప్పుడు ఈ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా అనేదే అందరి క్యూరియాసిటీ. ఈ సినిమా ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. ఈలోపే ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ గురించి బజ్ మొదలైంది. NTR 33 సినిమాకు దాదాపు దర్శకుడు కూడా ఫిక్స్ అయినట్లు ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే తారక్ కన్నడ , హిందీ భాషల డైరెక్టర్స్ తో కలిసి వర్క్ చేస్తున్నాడు. ఈసారి మరో భాష దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడట. అది మరెవరో కాదు.. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.

దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు కానీ.. ఇద్దరి మధ్య పలుమార్లు చర్చలు కూడా జరిగాయట. దాదాపు కథ విషయంలో ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థతో పాటు.. మరో భాగస్వామి కూడా ఉండనున్నారట. అది ఎవరో డిసైడ్ అయిన తర్వాత.. ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్సుమెంట్ ను ఇవ్వనున్నారు మేకర్స్. అయితే షూటింగ్ , క్యాస్టింగ్ లాంటి వివరాలు తెలియడానికి మాత్రం ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ఇటు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా తీయడానికి మరో ఏడాది పడుతుంది. అటు నెల్సన్ రజినీకాంత్ జైలర్ 2 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత.. నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా ఉంటుంది. ఇక వీరిద్దరూ కలిసి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobetgrandpashabet giriş