iDreamPost
android-app
ios-app

బాలకృష్ణ 109 అప్డేట్స్ సంగతేంటి ?

  • Published Nov 09, 2024 | 5:48 PM Updated Updated Nov 09, 2024 | 5:48 PM

2026 సంక్రాంతికి గట్టి పోటీ ఉందన్న సంగతి తెలిసిందే . ఇప్పటికే ఆ లిస్ట్ లో రామ్ చరణ్ తో పాటు .. బాలయ్య , వెంకటేష్ ల పేర్లు వినిపిస్తున్నాయి. వీటిలో ఆల్రెడీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్సినిమాల నుంచి ఎదో ఒక అప్డేట్ అయినా ఉంది. కానీ బాలకృష్ణ సినిమా నుంచి మాత్రం ఏ అప్డేట్ లేదు.

2026 సంక్రాంతికి గట్టి పోటీ ఉందన్న సంగతి తెలిసిందే . ఇప్పటికే ఆ లిస్ట్ లో రామ్ చరణ్ తో పాటు .. బాలయ్య , వెంకటేష్ ల పేర్లు వినిపిస్తున్నాయి. వీటిలో ఆల్రెడీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్సినిమాల నుంచి ఎదో ఒక అప్డేట్ అయినా ఉంది. కానీ బాలకృష్ణ సినిమా నుంచి మాత్రం ఏ అప్డేట్ లేదు.

  • Published Nov 09, 2024 | 5:48 PMUpdated Nov 09, 2024 | 5:48 PM
బాలకృష్ణ 109 అప్డేట్స్ సంగతేంటి ?

2026 సంక్రాంతికి గట్టి పోటీ ఉందన్న సంగతి తెలిసిందే . ఇప్పటికే ఆ లిస్ట్ లో రామ్ చరణ్ తో పాటు .. బాలయ్య , వెంకటేష్ ల పేర్లు వినిపిస్తున్నాయి. వీటిలో ఆల్రెడీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ గురించి గట్టి బజ్ వినిపిస్తుంది. ప్రమోషనల్ ప్లాన్స్ కూడా రెడీ చేసేస్తున్నారు. అటు వెంకటేష్ మూవీ టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. త్వరలోనే ఆ సినిమా నుంచి కూడా అప్డేట్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రెండు సినిమాల నుంచి ఎదో ఒక అప్డేట్ అయినా ఉంది. కానీ బాలకృష్ణ సినిమా నుంచి మాత్రం ఏ అప్డేట్ లేదు. వరుస బ్లాక్ బస్టర్స్ తో ఊపు మీద ఉన్నాడు బాలయ్య. పండగ సెంటిమెంట్ బాలయ్య కు బ్రహ్మాండంగా కలిసి వస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు టైటిల్ అనౌన్సుమెంట్ లేకపోవడంతో.. ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

ముందు ఈ సినిమాను దసరాకు తీసుకురావాలని అనుకున్నారు. ఆ తర్వాత దీపావళి అన్నారు. ఫైనల్ గా సంక్రాంతికి ఫిక్స్ చేశారు. కానీ ఎదురుచూస్తున్న కొద్దీ ప్రొడక్షన్ హౌస్ నుంచి మాత్రం ఎలాంటి సౌండ్ లేదు. అయితే రెండు వారల క్రితం టైటిల్ లీకులు మాత్రం వినిపించాయి. డాకూ మహారాజ్, సర్కార్ సీతారామ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఇంకా ఫైనల్ చేయలేదు. ఇంకా ఏ మ్యాటర్స్ బయటకు రాలేదేంటా అని ఆరా తీస్తే.. దర్శకుడు బాబీ పండగ డెడ్ లైన్ ని అందుకునేందుకు తెగ కష్టపడుతున్నాడని తెలిసింది. ఇప్పుడు సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయినా కానీ ఇంకా ఫస్ట్ కాపీ రెడీ కాకపోవడం ఆశ్చర్యం. ఇంకా సినిమాలోని ఇంపార్టెంట్ సీన్స్ కు సంబంధించిన షూట్ పెండింగ్ ఉందట. వాటిని ఎలా అయినా సరే ఈ నెలలో పూర్తి చేయాలనీ.. దర్శకుడు కంకణం కట్టుకుని కుర్చున్నాడట. సో ఒక్కసారి అది కాస్త పూర్తయితే అప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వచ్చేలా ఉన్నాయి.

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేశాడు బాలయ్య. ఇక ఇప్పుడు రెండో రౌండ్ కు రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా అఖండ 2కు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. ఈసారి అఖండ 2 లో బాలయ్య విశ్వ రూపం కనిపించబోతుందంటూ టాక్ కూడా నడుస్తుంది. ఇప్పుడు బాలయ్య 109 కంప్లీట్ అయితే.. అఖండ 2 సెట్స్ మీదకు వెళ్తుంది. బాలకృష్ణ ఇంత బిజీ బిజీగా ఉన్నా కానీ అన్ స్టాపబుల్ 4 కోసం తగినంత టైం కేటాయిస్తున్నాడు. ఈ షో తో ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు కానీ.. అసలైన సాలిడ్ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. టీజర్ ట్రైలర్, లిరికల్ సాంగ్స్ ఇలా బోలెడు లాంఛనాలు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఇవన్నీ ఎప్పుడు వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet